*పేదవాడి ముసుగు తో వస్తున్న పెద్ద పెత్తందారు జగన్.*
*పెత్తందారులు ఎవరో, పేదవారు ఎవరో మే 13 న ప్రజలే తేల్చుతారు జగన్.*
*హత్యలు, దాడులు, కబ్జాలు, అరాచకాలలో మొనగాడు జగన్.*
*ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పై జరిగిన దాడులలో ఆల్ టైమ్ రికార్డు జగన్ ప్రభుత్వం దే.*
*ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీల పథకాలను రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి*
*దోపిడీకి చిరునామాగా వైసీపీ ప్రభుత్వం మారిపోయింది*
*టిడిపి నేత కన్ను పోతే పొరబాటు…. జగన్ కు రాయి తగిలితే హత్యా ప్రయత్నమా ?*
*ఐపిఎస్ కే కళంకం తెచ్చిన అధికారి క్రాంతిరామ్ రాణా కమీషనర్ పదవికి అనర్హుడు.*
సమాజంలో అట్టడుగు వర్గాలకు అండగా నిలిచి వారి హక్కులు, సంక్షేమం, అభివృద్ది కోసం నిరంతరం పాటుపడిన మహానీయులు మహాత్మ జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ రామ్, డా.బి.ఆర్.అంబేద్కర్.
రాష్ట్రాన్ని నేడు పాలెగాళ్లు, పెత్తందారులు, దోపిడీదారులు ఏలుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పదే పదే పెత్తందారులకు.. పేదలకు మధ్య పోటీ అని మాట్లాడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఐదేళ్లు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేసి..ఇప్పుడు మీరే నన్ను కాపాడాలని కోరడం విడ్డూరం గా ఉంది.
పెత్తందారులు, పేదవాళ్ళ కు మధ్య పోటీ జరుగుతోందని… పేదవాడైన తనను రాష్ట్ర ప్రజలు కాపాడాలని జగన్ మరోమారు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తల్లి వదిలేసింది… చెల్లి వెళ్ళిపోయింది… నా అనుకున్నావారంతా నన్ను దూరం పెట్టారు, జాలి చూపాలని జగన్ చేస్తున్న వేడుకోలు ను మన్నించే స్థితిలో ప్రజలు లేరు.
స్వాతంత్ర్యం అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ లపై ఈ దేశంలోని ఏ రాష్ట్రంలో జరగనన్ని దాడులు వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జరిగాయి.
పెత్తందారున్ని కాను, పేదవాడినని చెప్పుకునే జగన్ తన పాలన లో 13 జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పై జరిపిన దాడులను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి.
చిత్తూరు జిల్లా న్యాయమూర్తి గా ఉన్న రామకృష్ణ ను వైసీపీ అల్లరి మూకలు వేధిస్తేనే దిక్కు లేదు. ఇక సామాన్యులు, బలహీనవర్గ ప్రజల పరిస్థితి ఏమిటి ?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ను ముఖ్యమంత్రి చేసేందుకు అహర్నిశలు శ్రమించిన చిన తండ్రి వివేకా ను హత్య చేస్తే విచారణ జరపలేకపోయిన అసమర్థుడు జగన్.
వైఎస్ వివేకా ను చంపింది ఎవరో, ఎందుకు చంపారో వివరంగా జగన్ చెల్లెళ్ళు వీధికెక్కి చెబుతుంటే జగన్ వర్గం తమకు సంబంధం లేదని ఇంకనూ బుకాయిస్తోంది.
చంద్రబాబు చెప్పమన్నదే తన చెల్లెళ్ళు చెబుతున్నారని వాదిస్తున్న జగన్….పాదయాత్ర చేయమని షర్మిలకు, షర్మిల ఆస్తి వాటా కు అడ్డుపడమని భారతి కి చెప్పింది చంద్రబాబే నా జగన్?
ఎన్నికల్లో సానుభూతి కోసం బాబాయ్ హత్యను జగన్ స్వార్థానికి వాడుకున్నారు. నారాసుర రక్త చరిత్ర అంటూ సాక్షి పత్రికలో కథనం వండి వార్చి, చంద్రబాబు పైకి ప్రజల దృష్టి మరల్చి మోసగించారు.
ఆస్థుల కోసం, అధికారం కోసం, ఆధిపత్యం కోసం విచక్షణ మరిచి వివేకా ను అత్యంత దారుణంగా హత్య చేసి ఆ నేరం టిడిపి పైకి నెట్టేస్తారా?
పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని ఎన్నికల ముందు ప్రచారం చేసి ప్రజలను మభ్య పెట్టి అధికారం లోకి వచ్చాక కేసు ను వెనక్కి తీసుకున్న అబద్దాలకోరు జగన్.
సిగ్గులేని ఐపీఎస్ అధికారి క్రాంతి రామ్ రాణా, టిడిపి నేత గాంధీ కన్ను పోతే పొరపాటు గా కీ చైన్ గుచ్చుకుందని, జగన్ కు గులకరాయి తగిలితే హత్యా ప్రయత్నం అని మాట్లాడుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి కి, వైసీపీ నేతలకు వత్తాసు పలికే ఐపీఎస్ అధికారి క్రాంతి రామ్ రాణా తన యూనిఫాం ను మూడు రంగులతో కుట్టించుకుని విధుల్లో చేరితే బావుంటుంది.
ఐఏఎస్, ఐపీఎస్ లను అసమర్థులుగా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వం దే. సీఎం కు భద్రత ఇవ్వలేని దుస్థితి లో కమీషనర్ క్రాంతి రామ్ రాణా ఉన్నారు.
దళితుడు డాక్టర్ సుధాకర్ ను నడిరొడ్డుపై హింసించిన మీరు పెత్తందారులు..డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేసి డోర్ డెలవరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు పెత్తందారుడు.
మైనార్టీ ఆడబిడ్డల ఆత్మహత్యలపై చర్చకు జగన్ సిద్దమా.. అక్కకి జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన గౌడ కుటుంబానికి చెందిన విద్యార్దిని తగలబెట్టిన ఘటన పై వైసీపీ ప్రభుత్వం చర్చకు సిద్దమా.
ల్యాండ్, శాండ్,మైనింగ్, మద్యం మాఫియా కి, దోపిడీకి చిరునామాగా వైసీపీ ప్రభుత్వం మారిపోయింది. రాష్ట్రాన్ని జిల్లాల వారీగా పంచుకుని తింటున్నారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీల పథకాలను రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి.
విదేశీ విద్యా పథకం ను కోర్టు అదేశాల తరువాత అంబేద్కర్ పేరు మార్చి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం గా అమలు చేశారు.
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం అందించాం. ఉచితంగా సివిల్ శిక్షణ ఇచ్చాం. వైసీపీ పాలన లో స్టడీ సర్కిల్ ద్వారా ఒక్కరికైనా శిక్షణ ఇచ్చారా..!
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు 40శాతం, 90శాతం రాయితీలతో లోన్లు ఇచ్చాం. వైసీపీ ప్రభుత్వంలో 3లక్షలపైగా లోన్లు కోసం అప్లికేషన్లు వచ్చాయి. ఒక్కరికైనా లోన్ ఇచ్చారా.
వైసీపీ పాలన లో ఒక్క బ్యాక్ లాగ్ పోస్టు అయినా భర్తీ చేశారా..
తెలుగుదేశం హయాంలో ఎస్సీలకు భూమి కోనుగోలు పథకం అమలు చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఎకరైనా ఇచ్చారా.. బెస్ట్ అవైలబుల్ పథకం ఏమైంది.
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మైనార్టీ యువతకు దాదాపు రూ.201కోట్లు సాయం చేశాం. రూ.5 వేల కోట్లు మైనార్టీ నిధులు జగన్ దారి మళ్లించారు.
రంజాన్ తోఫా ఎందుకు రద్దు చేశారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పగలరా. తెలుగుదేశం హయాంలోనే మైనార్టీల అభివృద్ది జరిగింది. మైనార్టీ అభివృద్ధిపై చర్చకు వైసీపీ ప్రభుత్వం సిద్దమా.
వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీలకు రక్షణ లేకుండా పోయింది. అబ్దుల్ సలాం, మిస్బాలు ఆత్మహత్య చేసుకోవడానికి వైసీపీ ప్రభుత్వమే కారణం.
మాజీ మండలి ఛైర్మన్ షరిఫ్ అమరావతి బిల్లుకి మద్దతు ఇచ్చారని అవమానకరంగా మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మొట్టమొదటి సారిగా రిజర్వేషన్ కల్పించిన పార్టీ తెలుగుదేశం. ఆ రిజర్వేషన్ ను తగ్గించి రాజ్యంగ బద్దంగా 16800 పదవులు కోల్పోయే విధంగా చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
బీసీలకు సంబంధించిన 30 పధకాలు రద్దు చేసి ..బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ.80 వేల కోట్లు దారి మళ్లించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి 13 జిల్లాల్లో మహాత్మ జ్యోతిరావు పూలే భవనాలు నిర్మించలేని అసమర్ధుడు జగన్మోహన్ రెడ్డి.
మే 13న జరిగే ఎన్నికలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు ఆత్మగౌరవ సమస్యగా మారాయి. రద్దయిన పథకాలు అమలు అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి.
బలహీన వర్గాల విలువ ఏంటో జగన్మోహన్ రెడ్డి కి తెలియాలంటే టీడీపీకి ఓటు వేసి వైసీపీని చిత్తు..చిత్తుగా ఓడించాలి.
- 5 ఏళ్ళ పాలనలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను వేధించిన జగన్ ప్రజలను మభ్య పెట్టేందుకు వస్తున్నారు. మే 13 న తమ ఓటు తో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి.