*పేదల జీవితాల్లో సంతోషం నింపే బడ్జెట్*
– 35 రూపాయలతో ప్రారంభమైన పెన్షన్ల పధకాన్ని ఏకంగా 4 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదే..
– గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచాలనే లక్ష్యంతో గ్రామీణాభివృద్ధి 18,848 కోట్లు. .
– “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల కోసమే 27 వేల 518 కోట్ల రూపాయలు
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్టం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణి చేసేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి కొడవలూరు మండలం రెడ్డిపాళెం గ్రామంలో ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. పుష్ప గుఛ్చాలు శాలువాలతో సన్మానించి తమ అభిమానం చాటుకున్నారు. సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఇంటింటికెళ్లి పెన్షన్లు అందచేశారు. ప్రజల యోగ క్షేమాలను విచారిస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం విస్మరించిన గ్రామాభివృద్ధి టిడిపి అధికారంలోనికి వచ్చాక గాడిలో పడిందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యాక రెడ్డిపాళెం గ్రామంలో ఎన్నికల సందర్భంగా యిచ్చిన హామీ తాలూకు తాగునీటి సమస్యను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. రెడ్డిపాళెం నుంచి అటు చెర్లోపాళెం, వేగూరు, మోడేగుంట, ముదివర్తి గ్రామాలకు వెళ్ళే మార్గ మధ్యలో తెగిపోయి వున్న బ్రిడ్జ్ ను సాధ్యమైనంత త్వరలో పునరుద్ధరిస్తామన్నారు. ఆధార్ కార్డులు లేని కారణంగా ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందుకోలేక పోతున్న గిరిజనుల కోసం స్పెషల్ ఆధార్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఎస్టీలకు నివాస స్థలాలతో పాటు పక్కా ఇళ్ళు నిర్మించి ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు.
35 రూపాయలతో ప్రారంభమైన పెన్షన్ల పధకాన్ని ఏకంగా 4 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదేనన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట ఆర్ధిక పరిస్థితి సంక్షోభంలో వున్నా…సంక్షేమ పథకాల అమలులో ఎటువంటి ఆటంకం జరగలేదన్నారు. రానున్న మే నెలలో చదువుకున్న తల్లికి వందనం పధకంలో భాగంగా చదువుకుంటున్న ప్రతి బిడ్డకు సంబంధించి తల్లుల ఖాతాలో 15 వేలు జమ అవుతాయన్నారు. ఐదేళ్లకు సరిపడా సంక్షేమం మరియు అభివృద్ధికి పునాదులు వేసుకుంటూ…ఎన్నికల సందర్భంగా చేసిన ప్రతి హామీ అమలు చేసే దిశగా కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కొనియాడారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రతిరోజూ , ప్రతిగంటా, ప్రతిక్షణం ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా వున్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారేనన్నారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సుబ్బారావు, టిడిపి నాయకులు వెంకట రమణారెడ్డి, బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, వినీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.