*పేదల ఇళ్ల కేటాయింపులలో తప్పులు సరిదిద్దండి*
– అర్హులను గుర్తించి ఇళ్ళు మంజూరు చేయండి.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
గతంలో అర్హులైన ప్రభుత్వం పేదలకు యిచ్చిన ఇళ్ళు, ఇళ్ల స్థలాలలో అవకతవకలు సరిదిద్దాలని కోరారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని విపిఆర్ నివాసంలో కోవూరు నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపిడిఓలు మరియు హౌసింగ్ అధికారులతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తహసీల్దార్లు, ఎంపిడిఓలు మరియు హౌసింగ్ అధికారులు పరస్పరం సమన్వయంతో పని చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో బుచ్చి, కోవూరు, ఇందుకూరుపేట, విడవలూరు కొడవలూరు మండలాలలో గత ప్రభుత్వం వేసిన లేఅవుట్ల ఖాలీ ప్లాట్లు గుర్తించాలని ఎమ్మెల్యే ప్రశాంతి గారు అధికారులను ఆదేశించారు. ఎవరికి కేటాయించని ఖాళీ ప్లాట్లు వుంటే అర్హులను గుర్తించే వెంటనే వారికి మంజూరు చేయాలని కోరారు. గతంలో అనర్హులకు ప్లాట్లు లేదా ఇళ్ళు కేటాయించివుంటే వాటిని అర్హులైన పేదలకు అందచేయాలన్నారు. ఈ సమావేశంలో బుచ్చి, కోవూరు, ఇందుకూరుపేట, విడవలూరు కొడవలూరు తహసీల్దార్లు, ఎంపిడిఓలు మరియు హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.