*పేదల ఇళ్లు అంటే అంత అలుసా*
*విజిలెన్స్ ఎంక్వయిరీలో రూ.120 కోట్ల అవినీతి నిర్ధారణ జరిగింది. క్వాలిటీ మీద విచారణ జరిపితే మరో రూ.150 కోట్ల స్కాం వెలుగుజూస్తుంది*
*తప్పు చేసిన వాళ్లు ఎంత పెద్దోళ్లయినా ఉపేక్షించవద్దు*
*హౌసింగ్ అక్రమార్కులను ప్రజల మధ్య నిలబెట్టాలి*
*క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు ఇళ్ల నిర్మాణం క్వాలిటీతో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి*
*తోటపల్లి గూడూరు మండలం వరిగొండ కాలనీతో పాటు పొదలకూరులోని చిట్టేపల్లి తిప్పపై కాలనీని సందర్శించిన రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, హౌసింగ్ ఎండీ రాజాబాబును కోరిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*వరిగొండతో పాటు పొదలకూరులో పేదల ఇళ్ల పనులు జరిగిన తీరును చూసి విస్తుపోయిన మంత్రి, ఎండీ*
*వైసీపీ నేతలు మాయమాటలతో మభ్యపెట్టారని, నగదు వారి చేతికి ఇచ్చి మోసపోయామని బోరుమన్న వరిగొండ మహిళలు*
*పొదలకూరులో స్థలాల రిజిస్ట్రేషన్ లోనూ పొరపాట్లు*
*ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయని, కఠినచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన మంత్రి పార్థసారథి, ఎండీ రాజాబాబు*
*సోమిరెడ్డి కామెంట్స్*.
పేదలు పదికాలాలు పాటు ఉండాల్సిన ఇళ్లలో అవినీతికి పాల్పడటం దుర్మార్గం
ప్రస్తుతం అసంపూర్తిగా ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాల నాణ్యతను తేల్చాలి
నిర్మాణ పనులు కొనసాగిస్తే అవి ఎంత మేరకు పనికొస్తాయో స్పష్టత తేవాలి
ఒక్క చిన్న బంగారు ఉంగరాన్ని దొంగతనం చేస్తే, నిందితుడిని పోలీసులు మీడియా ముందు నిలబెట్టి చేతిలో దొంగ అని రాసి పలక పెడతారు
ఇప్పుడు ప్రజల సొత్తు కోట్లాది రూపాయలు కాజేసిన వారికి ఏ శిక్ష వేయాలి
పేదల సొంతింటి కల నెరవేరకకుండా అక్రమాలకు పాల్పడిన వారిపై తీసుకునే చర్యలు కఠినంగా ఉండాలి
తప్పు చేసిన వారిపై ఇప్పుడే చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో పొరపాట్లు జరగకుండా అరికట్టవచ్చు
కాకాణి గోవర్ధన్ రెడ్డి తన కరోనా హౌస్ ను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సామగ్రితో కోట్లాది రూపాయలు వెచ్చించి విలాసవంతంగా నిర్మించుకున్నాడు
పేదలు మాత్రం నాసిరకంగా నిర్మించిన ఈ ఇళ్లల్లో కష్టాలు అనుభవించాలా
పూరి గుడిసెలో పుట్టిన కాకాణి ఈ రోజు ఎన్ని బంగ్లాలు కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు..వారి అవినీతి దాహంతో గూడులేని వారి మారిన పేదల పరిస్థితి ఏంటి
పది అడుగుల మేర వేయాల్సిన పిల్లర్ ను వరిగొండలో మూడు అడుగులు కూడా వేయలేదు. అనేక ఇళ్లకు అసలు పిల్లర్లు వేయడమే విస్మరించారు
లేఅవుట్ ను చదును చేయకుండానే రూ.46.28 లక్షలు బిల్లు చేసుకున్నారు
ఆఫ్షన్ 1& 2 లో మంజూరైన ఇళ్లకు కూడా లబ్ధిదారులను మభ్యపెట్టి నగదు తీసేసుకున్నారు..ఇళ్లు మాత్రం కట్టకుండా మోసం చేశారు
పొదలకూరు చిట్టేపల్లి తిప్పలోనూ అదే పరిస్థితి. పిల్లర్ కు బేస్మెంట్ కు సంబంధం లేకుండా పనులు చేశారు
900కి పైగా ఇళ్ల నిర్మాణం చేపడితే ఇప్పటికి పూర్తయింది ఒక్కటే
గ్రావెల్ గుట్ట అయిన చిట్టేపల్లి తిప్పపై చేపట్టిన కాలనీకి మర్రిపల్లి నుంచి గ్రావెల్ తోలినట్లు కోట్ల రూపాయలు బిల్లులు చేసుకోవడం దుర్మార్గం
ప్రజల సొత్తు దోపిడీ చేసే హక్కు ఎవరిచ్చారు
తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు ఇళ్లన్నీ నాణ్యతతో పూర్తి చేసే వరకు వదిలిపెట్టొద్దు
ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని పేదల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను