
*పేదలు నివసించే ప్రాంతాల్లో నీటి పన్ను రద్దు చేయాలి…… సిపిఎం డిమాండ్*
………….. …… ……… …. …….
నెల్లూరు 29వ డివిజన్ వి.మాలకొండారెడ్డి నగర్, మహాత్మా గాంధీ నగర్, సుభాస్ చంద్రబోస్ నగర్, వెంకటరెడ్డినగర్ మరియు డాక్టర్ రామచంద్రారెడ్డి నగర్ లలో నివసించే పేదలకు గతంలో జాతీయ మురికివాడల అభివృద్ధి పధకం (ఎన్ ఎస్ డి పి) ద్వారా ఇచ్చిన ఉచిత మంచినీటి కుళాయి కనెక్షన్లకు నీటి పన్ను రద్దు చేయాలని కోరుతూ స్థానిక ప్రజలు సిపిఎం ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి మునిసిపల్ కమీషనర్ వై.ఓ.నందన్ గారికి అర్జీ సమర్పించారు.
ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్ ఎస్ డి పి పథకం ద్వారా పేదలకు ఇచ్చిన కుళాయి కనెక్షన్లకు ఇప్పుడు ఉన్న పళంగా వేలాది రూపాయలు నీటి పన్ను చెల్లించాల్సిందే నని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ద్వారా నోటీసులు యిప్పించడం సరి కాదన్నారు.
ఇప్పటి కిప్పుడు వేలాది రూపాయలు నీటి పన్ను చెల్లించ గలిగే స్థితిలో లేని రోజువారీ కూలీపనులు చేసుకుని బ్రతికే కుటుంబాలకు నీటి పన్నుల భారాన్ని రద్దు చేయాలని కోరారు.
ఇదే విషయాన్ని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్మన్ మరియు జిల్లా జడ్జి గారు పరిశీలించి పేదలకు న్యాయం చేయాలని డిసెంబరు 13వ తేదీన జరిగే లోక్ అదాలత్ సందర్భంగా విజ్ఞప్తి చేస్తామన్నారు.
సీపిఎం నెల్లూరు రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు కె.పెంచలనరసయ్య మాట్లాడుతూ పేదవాడల్లో నీటి పన్నుల రద్దుకై ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
సిపిఎం రూరల్ కమిటీ సభ్యులు ఎస్ డి రఫీఅహ్మద్ మాట్లాడుతూ పేదవారికి అందరికీ నీటి పన్ను రద్దు చేసేంత వరకు సిపిఎం అండగా వుంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం 29వ డివిజన్ శాఖ కార్యదర్శి దేవతాటి.రాజ, రూరల్ కమిటీ సభ్యులు ఎన్ మాలకొండయ్య,కండే కోటేశ్వరరావు, సిపిఎం శాఖ కార్యదర్శి
షేక్ జావీద్,డివైఎఫ్ఐ నాయకులు అఖిల్, చంటి,నరేష్,సందాని,ఆవాజ్ నాయకులు నజీర్ భాయ్,మీరాభాయ్, హుస్సేన్ మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు.
అభివందనములతో,
సం/ దేవతాటి. రాజ
సం/ షేక్ జావీద్
29 వ డివిజన్ శాఖల కార్యదర్శులు.