పేదలందరికీ ఇల్లు *ప్రధాని మోడీ లక్ష్యాన్ని కి తూట్లు పొడుస్తున్నరనీ* బిజెపి నేత మిడతల రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు…
ఇది ఒక పేద గిరిజనుడికి ప్రభుత్వం నిర్మించిన పక్కా గృహం.
తలుపులు .కిటికీలు. ద్వారా బంధరాలు .వాటర్ ట్యాంకు .కరెంటు సామాగ్రి. లాంటి అన్ని సదుపాయాలు కల్పించినట్లుగా నిర్మించిన గృహం.
హౌసింగ్ అధికారులు అన్ని సదుపాయాలు కల్పించామని బిల్లులు చెల్లించారు.
ప్రధాని మోడీ ఇచ్చిన డబ్బులతో అమర్చిన తలుపులు ద్వారా బంధరాలు లబ్ధిదారుడు ఎంత వెతికిన కనిపించలేదు.
కనిపించని తలుపును వెతకడం కన్నా… *ఎండుకొమ్మలతో ఆ గిరిజనుడు తలుపు గా ఒక తడికను అమర్చుకున్నాడు*.
మనుబోలు మండలంలో 21 మంది గిరిజనులు కు పక్కా గృహాలు పూర్తయ్యాయి. ఆ నాణ్యమైన ఇళ్ల నిర్మాణాలు చూసుకున్న గిరిజనులు *పక్కాగృహాల కంటే గుడిసెలే మేలని* అందులోనే ఉండిపోయారు.
కేంద్ర ప్రభుత్వ నిధులను గత ప్రభుత్వ హయాంలో ఇష్టం వచ్చినట్లు అధికారులు కాంట్రాక్టర్లు కలిసి దుర్వినియోగం చేశారు.
రాష్ట్రంలో కూటమి సర్కార్ వచ్చినప్పటికీ హౌసింగ్ అధికారు లు దోపిడీ విధానాన్నీ కొనసాగిస్తూనే ఉన్నారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వ పేదరిక నిర్మూలన లక్ష్యాలను అడ్డుకొని నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అవినీతిపై దర్యాప్తు చేసే ఏజెన్సీలు లేవని హౌసింగ్ అధికారులు నిర్భయంగా దోపిడీ చేస్తున్నారనీ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.