*పెయ్యలపాలెం గ్రామాన్ని
అభివృద్ధి చిరునామాగా
మారుస్తా : నేహారెడ్డి*

 

కొడవలూరు, ఏప్రిల్ 19, పెయ్యలపాలెం గ్రామాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తామని నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కుమార్తె, వైఎస్సార్సీపీ నేత నేహారెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం తన తల్లి సునంద రెడ్డి, స్థానిక సర్పంచ్ పెనాక అనూష, పార్టీ నేతలు పెనాక శ్రీనివాసులు రెడ్డి, పెనాక సుభాష్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తన తండ్రి ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు చేస్తామని అన్నారు. పెయ్యలపాలెం గ్రామం తన అత్తమామల ఊరని, తాను ఈ ఊరు కోడలునని, ఈ గ్రామాన్ని తమ కుటుంబానికి చెందిన అరబిందో కంపెనీ ద్వారా దత్తత తీసుకొని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే భాగంలో గ్రామంలో వాటర్ ప్లాంట్, రోడ్డు, దేవాలయాల అభివృద్ధి, స్కూల్స్ నిర్వహణ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. గ్రామంలో ఇంటింటా ప్రచారం చేపట్టడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందేందుకు, నెల్లూరు సర్వతోముఖాభివృధ్ధికి ఎంపీగా తన తండ్రి విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యేగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని మే 13 న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలంతా వైఎస్సార్సీపీకి ఓటువేసి జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.
డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు మాట్లాడుతూ విజయసాయిరెడ్డికి ఓటు వేయడం ద్వారా భారతదేశ అభివృద్ధి చిత్రపటంతో నెల్లూరుకు ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు. వైఎస్సార్సీపీ కి ఓటువేయడం ద్వారా ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి సాధించనుందని అన్నారు. నెల్లూరు రూపురేఖలు మారనున్నాయని అన్నారు. అలాగే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి దశాబ్దాలుగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, అన్ని విధాలుగా ఆయన కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసారని అన్నారు. మరింత అభివృద్ధికి, సంక్షేమానికి ఎంపీగా విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యేగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా సీతారామ దేవాలయం, పోలేరమ్మ దేవాలయం, గంగమ్మ దెవాలయాలు దర్శించుకున్నారు. అంతకు ముందు గ్రామానికి వచ్చిన నేహారెడ్డి, సునంద రెడ్డి లను గ్రామస్థులు గ్రామ పొలిమేర్లలో హారతులతో అఖండ స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మేకపాటి దీప్తి, పెనాక గోపీనాథ్ రెడ్డి, జీ మస్తానయ్య, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మొయిల్ల గౌరీ, కర్తం జ్యోతి, బెందాళం పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *