*పెన్షన్ పంపిణి కార్యక్రమం లో జనసేన వీర మహిళ విజయ లక్ష్మి*
రాష్ట్ర మంత్రివర్యులు డా పి నారాయణ గారి,ఏపి టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ గార్ల సూచనల తో నెల్లూరు సిటీ,గుర్రాల మడుగు సంఘం,16వ డివిజన్లో విజయ లక్ష్మీ గారు ఉదయం 7:00 గంటలు నుంచి పెన్షన్లు ఇంటి వద్దనే అందించారు..
స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే తెలుపవలసిందిగా కోరారు… గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు,గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు,మంత్రి నారాయణ గారి ఆశయాలు కనుగుణంగా కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమముగా సంక్షేమ ధ్యేయంగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు.
మంత్రి నారాయణ గారి సతీమణి శ్రీమతి పొంగూరు రమాదేవి గారు సిటీ ప్రజల బాగోగులు ఎప్పటికప్పుడు చూసుకుంటారని,మోడల్ సిటీ గా నెల్లూరు చేసేందుకు వారి శ్రమ ప్రశంశనీయం అని తెలిపారు..పేదలకు సంక్షేమ పథకాలు అందే విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియపరచాలని కోరారు…
* పై కార్యక్రమంలో జనసేన పార్టీ !వీర మహిళలు విజయ లక్ష్మీ,శాంభవి,నాయకులు నరహరి,విశ్వనాద్,వెంకటరమణ,ఆకాష్,హేమచంద్ర యాదవ్,యాసిన్,షాజహన్,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.