పెన్షన్ల పంపిణీ ప్రక్రియ 100% పూర్తి చేయండి

– కమిషనర్ వై.ఓ నందన్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియను నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతి ఒక్క వార్డు సచివాలయ పరిధిలో 100% పూర్తి చేయాలని కమిషనర్ వై ఓ నందన్ ఆదేశించారు.

స్థానిక స్నేహ నగర్ రెండవ వీధిలో పెన్షన్ పంపిణీ ప్రక్రియలో కమిషనర్ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ మొత్తాలను గురువారం అందజేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఐ.వి.ఆర్ ఫోన్ కాల్ ద్వారా పెన్షన్ దారుల అభిప్రాయ సేకరణలో వారు తెలియజేసే సంతృప్తి స్థాయిని పరిగణలోకి తీసుకుంటారని, కావున పెన్షన్ లబ్ధిదారులతో వినయపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.

26 మంది జోనల్ ఇన్చార్జీలు తమకు కేటాయించిన సచివాలయాలలో పెన్షన్ పంపిణీ ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. 300 మీటర్ల దూరానికి పైన ఉన్న గృహాలకు చేరుకోలేని కారణాలను యాప్ లో ఎంచుకొని అప్లోడ్ చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed