*పీరయ్య మృతి తెలుగుదేశం పార్టీ కి తీరని లోటు..*

*పార్టీ కోసం పనిచేయడమే తప్ప ఏనాడు పార్టీ ని సాయం కోరని వ్యక్తి పీరయ్య*

*పీరయ్య మృతి తో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను తెలుగుదేశం పార్టీ కోల్పోయింది*

*- ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్*

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మంగళగిరి లో ఎంజిఎన్ఆర్ఇజిఎ, నీరు చెట్టు విభాగాల సభ్యులు వీరంకి గురుమూర్తి, సుభాషిని, ఆళ్ల గోపాలకృష్ణ, శ్రీధర్, రాజా నేతృత్వంలో జరిగిన MGNREGA విభాగం సభ్యుడు పీరయ్య సంతాప సభ లో పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, కావలి శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి, మాజీ శాసన మండలి సభ్యులు అశోక్ బాబు లతో కలిసి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర పాల్గొన్నారు.

అనంతరం వారి చిత్ర పటానికి నివాళులు అర్పించారు.

*ఈ సందర్బంగా బీద మాట్లాడుతూ…..*

పీరయ్య క్రమశిక్షణ కలిగిన కార్యకర్త. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు.

తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నీరు-చెట్టు, ఉపాధి హామీ పథకం లాంటి అనేక పెండింగ్ బిల్లుల సాధనలో పీరయ్య చేసిన కృషి అభినందనీయం.

పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తెలుగుదేశం నేతలు, కార్యకర్తలకు నీరు _చెట్టు , ఉపాధి హామీ సభ్యులు అండగా నిలిచారు. న్యాయస్థానాలను ఆశ్రయించి 21 వేల కేసులు వేయడం ద్వారా అధికార పార్టీ అరాచకాలను నిలువరిస్తూ వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు సాధించారు.

ఎవరి వద్ద ఎప్పుడూ ఒక్క రూపాయి ఆశించని వ్యక్తి పీరయ్య. మంచి పని కోసం ధైర్యంగా ముందుకెళ్లేవారు.

పీరయ్యకు బాలకృష్ణ, ఎన్టీఆర్, చంద్రబాబు చిత్రాల పై ఎక్కువ మక్కువ ఉండేది.సుభాషిణమ్మ, గురుమూర్తి లతో కలిసి నిత్యం పార్టీ కోసం పీరయ్య పని చేసేవారు.

బట్టలు, మంచం, ఒక సంచి తప్పితే పీరయ్య మిగుల్చుకున్నది ఏమీ లేదు. చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారితో తీయించుకున్న ఫొటోలే పీరయ్య ఆస్తి.

పీరయ్య పరిస్థితి చూసి మేమే ఆశ్చర్యపోయేవాళ్లం. ఇబ్బందులు ఉండికూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసేవాడు. పీరయ్యలాంటి కార్యకర్తలు చాలా తక్కువ.

పీరయ్య తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు ఎనలేనివి. ఆయన కు నివాళులర్పించాల్సిన పరిస్థితి రావడం బాధాకరం.

పీరయ్య కు, ఆయన కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ ఎంతో రుణపడి ఉంది. ఆయన కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా సహాయం చేయడానికి పార్టీ ముందుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed