*పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే విద్య మాత్రమే — వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*
*నాడు-నేడు ద్వారా కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లీష్ మీడియం చదువులు — ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*
*రౌడీ ఎమ్మెల్యే కావాలా..? అజాతశత్రువు, మచ్చలేని మంచి ఎమ్మెల్యే కావాలా..? ప్రజలు ఒక్కసారి ఆలోచించండి- ఎంపీ విజయసాయిరెడ్డి*
*జన సంద్రమైన సౌత్ మోపూరు*
*సౌత్ మోపూరు అంతా వైసీపీ వెంట — సత్తా చూపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు*
*సౌత్ మోపూరు గ్రామంలో ఎన్నికల ప్రచార రోడ్ షో నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి*
*చేతులు ఊపి మద్దత్తు సంఘీభావాన్ని తెలిపిన సౌత్ మోపూరు గ్రామస్తులు*
*ఎన్నికల ప్రచార రోడ్ షో కు స్వచ్ఛందంగా తరలివచ్చిన సౌత్ మోపూరు గ్రామస్తులు*
*ఓపెన్ టాప్ జీపుపై నుండి రెండు చేతులతో రోడ్ షోకు స్వచ్ఛందంగా విచ్చేసిన సౌత్ మోపూర్ గ్రామస్తులకు హృదయపూర్వకంగా అభిమానం చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి*
*ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గార్లకు ఘన స్వాగతం పలికిన సౌత్ మోపూర్ గ్రామస్తులు*
అన్ని ప్రాంతాలు మంచి అభివృద్ధి సాధించాలంటే ప్రతి ఇంట్లో పిల్లలు చక్కగా మంచి చదువులు చదువుకోవాలన్న చక్కటి ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వబడుల రూప్ రేఖల దిశ దశలను మార్చే విధంగా కార్యక్రమాలను చేయడం జరిగిందని రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. రేపటి తరానికి మనం ఏదైనా ఇవ్వగలిగిన ఆస్తి ఉందంటే అది ఒక నాణ్యమైన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య మాత్రమేనని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. నెల్లూరు రూరల్ మండలంలోని సౌత్ మోపురు గ్రామంలో నెల్లూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు నగర మేయర్ పోట్లూరు స్రవంతి జయవర్ధన్, పార్టీ సీనియర్ నాయకులు మలిరెడ్డి కోటారెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి, ఎంపీపీ బూడిద విజయ్ కుమార్, స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. *ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సౌత్ మోపురు గ్రామానికి చెందిన ప్రముఖ సీనియర్ టిడిపి నాయకులు మన్నారపు శివయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి వైసిపి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది*. గ్రామాల అభివృద్ధి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని భావించి తెలుగుదేశం పార్టీని వీడి స్వచ్ఛందంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మన్నారపు శివయ్యను వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మనస్ఫూర్తిగా అభినందించి వైసిపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తమపై నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రూరల్ నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరిన మన్నారపు శివయ్య, ఆయన మిత్ర బృందానికి గౌరవప్రదమైన ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, సముచితమైన స్థానం కల్పించడం కల్పించి అన్నివిధాలా అండగా ఉంటానని రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో *సౌత్ మోపురు గ్రామ టిడిపి నుంచి వైఎస్ఆర్సిపిలో చేరిన వారిలో మన్నారపు రాజయ్య, కండే రవి, డేగ శ్రీహరి, మన్నారపు మాల్యాద్రి, మన్నారపు చిన్నబ్బాయ, ఎస్.కె నజీర్, కొంగి శివయ్య, చీమల వెంకట రామయ్య, పేరతూరు వెంకయ్య, షేక్ కరిముల్లా, వేంపులూరు లీలా ప్రసాద్, భాగం వెంకటేశ్వర్లు, రాపూరు శేఖర్, గంట పెంచలయ్య, వేంపులూరు శివయ్య, తాడిపత్రి వెంకటేశ్వర్లు, సిహెచ్ లక్ష్మమ్మ, ధనయ్య, తిరుపతి* తదితరులు తోపాటు వారి మిత్రబృంద సభ్యులు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బుధవారం సాయంత్రం సౌత్ మోపూర్ గ్రామంలోని మన్నారపు శివయ్య నివాసంలో చేరడం జరిగింది. సౌత్ మోపురు గ్రామంలో ఎన్నికల ప్రచార సభలో *నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధిని ఆకాంక్షించే అజాతశత్రువు, మంచిమనిషి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా కావాలా..? రౌడీయిజం చలాయించి నిత్యం ప్రజలను వేధించి ఇబ్బందులకు గురి చేసే శ్రీధర్ రెడ్డి లాంటి రౌడీ ఎమ్మెల్యేగా కావాలా..? ప్రజలు ఆలోచించాలని తెలియజేశారు.* ఈనెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని అత్యధిక మెజార్టీ గెలిపించాలని మాజీ డిసిసిబి చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండలం జెసిఎస్ అధ్యక్షులు చేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తుమల కిరణ్ రెడ్డి, పి.సతీష్ యాదవ్, వేమిరెడ్డి హంసకుమార్ రెడ్డి, వేమిరెడ్డి అశోక్ రెడ్డి, వేమిరెడ్డి ఆనంద్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పుచ్చలపల్లి రాంప్రసాద్ రెడ్డి, నియోజకవర్గం పరిశీలకు మల్లు సుధాకర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు స్వర్ణ వెంకయ్య, సిహెచ్ హరిబాబు యాదవ్, బద్దెపూడి రవీంద్ర, వేమిరెడ్డి హారిశివారెడ్డి సౌత్ మోపూర్ గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.