*పినాకిని పార్కు లోపల జరుగుతున్న అభివృద్ధి పనులలో భాగంగా ఇసుక లెవలింగ్, ఇతర పనులను పర్యవేక్షించిన కమిషనర్ వై ఓ నందన్*

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ దైనందిన నగర పర్యటనలో భాగంగా స్థానిక రంగనాయకులపేటలోని పినాకిని పార్కును ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు.

స్థానికంగా పార్కు మార్గంలో జరుగుతున్న డ్రైన్ కాలువలు, కల్వర్టుల నిర్మాణ పనులను పరిశీలించి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం పార్కు లోపల జరుగుతున్న అభివృద్ధి పనులలో భాగంగా ఇసుక లెవలింగ్, ఇతర పనులను కమిషనర్ పర్యవేక్షించారు.

నిర్దేశించిన సమయానికి పార్కులో అన్ని మౌలిక సదుపాయాలు, వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చేలా పచ్చదనం, మొక్కల పెంపకం, చిన్నపిల్లల ఆట వస్తువులు తదితర వాటిని ఏర్పాటు చేసి పార్కును పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు,నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ రహంతు జానీ, శానిటేషన్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed