*”పిచ్చోడి చేతిలో రాయిలా నెల్లూరు కార్పొరేషన్” – కాకాణి*
*SPS నెల్లూరు జిల్లా..*
*తేది:02-02-2025*
*నెల్లూరు నగర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*
*మంత్రి పొంగూరు నారాయణపై, నెల్లూరు నగర కమీషనర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు…*
👉నెల్లూరు కార్పొరేషన్ కు సంబంధించి గతంలో ఎన్నడూ జరగని ఘోరాలు జరుగుతున్నాయి…
👉తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వుండి, వైసీపీ పార్టీకి అనుకూలంగా వుంటే వారి మీద దాడులు చేస్తూ, వేధింపులకు గురి చేస్తున్నారు…
👉 మంత్రి నారాయణ నెల్లూరు లో కొత్త రాజకీయాలకు తెరలేపారు..
👉కాలువ గట్టు మీద ఇళ్లు వుంది అనే నెపంతో వైసిపి కి చెందిన బాలకృష్ణా రెడ్డి ఇళ్లు కూల గొట్టారు, కాలువ గట్టు మీద బాలకృష్ణా రెడ్డి ఇళ్లు ఒక్కటే కనిపించిందా?….
👉 బాలకృష్ణా రెడ్డి కుటుంబానికి చెందిన, 50 ఏళ్లుగా పట్టా వుండి, కార్పొరేషన్ కు పన్నులు కడుతున్న ఇంటిని ఎలా కూలగొడతారు?
👉కోర్టులో స్టేలో వున్న ఇళ్లును కూలగొట్టిన విషయంలో
IAS చదివిన నెల్లూరు నగర కమీషనర్ నేడు కోర్టు ధిక్కారం కింద దోషిగా నిలబడ్డాడు..
👉కమీషనర్ గారూ.., మంత్రి నారాయణ ఎప్పుడు రాజకీయాలు నుండి వెళ్ళిపోతారో తెలియదు, అలాంటి వారి మాట విని ఇబ్బందులు పడకండి.
👉మారువేషంలో నారాయణ నెల్లూరులో తిరిగితే పొంగూరు నారాయణ పాలన కాదు, తుగ్లక్ పాలన అంటూ ప్రజలు అనుకుంటున్న మాట వాస్తవమని తెలుస్తుంది..
👉 నెల్లూరు కమీషనర్ మంత్రి నారాయణ చెప్పినట్టు వింటూ తన IAS కి చెడ్డ పేరు తెస్తున్నాడు ..
👉 నెల్లూరు లో ఖాళీ స్థలాలకు టాక్స్ కట్టలేదని కార్పొరేషన్ అధికారులు తమకు చెందిన స్థలాలుగా నోటీస్ బోర్డులు పెడుతున్నారు ఇది చాలా అన్యాయం ..
👉నెల్లూరు చరిత్రలో ఎన్నడూ జరగని అన్యాయాలు నేడు జరుగుతున్నాయి.
👉నిరుపేదలు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లు కూలగొడితే, ఆ బాధ ఎలా వుంటుందో నారాయణకు తెలుసా?
👉 నెల్లూరు నగర కార్పొరేషన్ కమీషనర్ మంత్రి నారాయణ ఆదేశాలను అమలు చేస్తూ, ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు…
👉 నివాసం వున్న ఇల్లు వైసిపి ఇల్లు అయితే కూల్చండి,టిడిపి ఇల్లు అయితే ఎన్ని తప్పులు వున్నా వదిలేయండి అన్నట్లు కమీషనర్ పనిచేస్తున్నాడు…
👉నెల్లూరు జిల్లాలో విద్వంస పాలన కొనసాగుతుంది…పాపాలు అన్నీ శాపాలుగా మారుతాయి..
👉అధికారం లేకపోయినా కార్యకర్తలను కాపాడుకుంటాం కానీ, కార్యకర్తలను విడిచే ప్రస్తక్తే ఉండదు, అండగా నిలబడుతాం.
👉కమీషనర్ ఇలానే అధికార పార్టీకి కొమ్ము కాస్తూ అక్రమాలకు పాల్పడితే, భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది.