*పార్టీ కోసం కష్టపడ్డ ఏ కార్యకర్తను విస్మరించను*
– టిడిపి సీనియర్ కార్యకర్త పరవత్తూరు రమణయ్య కుటుంబ సభ్యులకు 66 వేల 713 రూపాయల CMRF చెక్కు అందచేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.
దంపూరు పంచాయతి వార్డు మెంబర్ పరవత్తూరు రమణయ్య మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని ఆమె నివాసంలో టిడిపి సీనియర్ కార్యకర్త రమణయ్య కుటుంబ సభ్యులకు 66 వేల 713 రూపాయల విలువ చేసే CMRF చెక్కు అందచేశారు. రమణయ్య కుటుంబ సభ్యులకు అవగాహన లేక సకాలంలో CMRF కు దరఖాస్తు చేసుకోలేకపోయినా మానవతా దృక్పధంతో CMRF దరఖాస్తును ఆమోదించిన అధికారులకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ధన్యవాదాలు తెలియచేసారు. ఈ సందర్భంగా పార్టీ కోసం కష్ట పడ్డ ఏ నాయకుడిని కానీ.. ఏ కార్యకర్తను విస్మరించే పరిస్థితే వుండదని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో విడవలూరు టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, కొమ్మి శ్రీధర్ నాయుడు, అడపాల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.