
*పార్టీలో కష్టపడిన ప్రతి నాయకుడికి గుర్తింపు ఉంటుంది*
*వీరేంద్ర నాయుడుకి ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్ పదవి ఇవ్వడంపై ఎమ్మెల్యే ప్రశాంతమ్మ శుభాకాంక్షలు*
– యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పనిచేయాలని సూచన
– ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ సహకారంతోనే పదవి వచ్చిందని వీరేంద్ర నాయుడు వెల్లడి
– పాత నాయకులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదన్న అపోహ ఈ పదవితో తొలగిపోయింది
– తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన వీరేంద్ర నాయుడు
తెలుగుదేశం పార్టీలో కష్ట కాలంలో పార్టీ జెండా మోసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు పార్టీ అధిష్టానం తప్పకుండా న్యాయం చేస్తుందని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. అందుకు నిదర్శనమే వీరేంద్ర నాయుడుకి ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్ గా పదవి ఇవ్వడమేనని చెప్పారు. ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్ గా పదవి రావడం పై ఇందుకూరుపేట మండల పార్టీ మాజీ అధ్యక్షులు వీరేంద్ర నాయుడు, అతని అనుచరులతో కలిసి బుధవారం ఎమ్మెల్యే ప్రశాంతమ్మను విపిఆర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కోవూరు నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలే లక్ష్యంగా వీరేంద్ర నాయుడు పని చేయాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా వీరేంద్ర నాయుడికి ఎమ్మెల్యే ప్రశాంతమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీలో జెండా మోసిన, ఓర్పు కలిగిన నాయకులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
వీరేంద్ర నాయుడు మాట్లాడుతూ తనకు పదవి రావడంలో అన్ని విధాలా సహకరించిన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పటిదాకా ఒక అపోహ ఉండేదని, పాత నాయకుల్ని పట్టించుకోవట్లేదనే అపోహ ఈ పదవితో పోయిందన్నారు. పాత తరం నాయకులకు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు వెల్లడించారు. తనకు లభించిన పదవి ద్వారా కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూనే ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గానికి మరింత వన్నె తెచ్చేలా పని చేస్తామన్నారు. పాత నాయకులకు న్యాయం చేసే విధంగా ప్రశాంతమ్మ దంపతులు ఎంతో కృషి చేశారని వెల్లడించారు. ఇందుకూరుపేట మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.