
*పార్కులలో అన్ని వసతులను కల్పించి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించిన నగర కమీషనర్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ గురువారం స్థానిక 4,7,9 డివిజన్లలోని సత్యనారాయణపురం పార్కు, జాకీర్ హుస్సేన్ నగర్ పార్కు, బంగ్లా తోట పార్కులను గురువారం సందర్శించారు.
పార్కులకు పోయే మార్గాల్లో జంగిల్ క్లియరెన్స్ చేయించి,ఆక్రమణలు తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ ఆదేశించారు. పార్కులలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులను కమిషనర్ పర్యవేక్షించి మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
పార్కులలో అన్ని వసతులను కల్పించి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ సూచించారు.
అనంతరం తోటబడి ప్రాంతంలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ను కమిషనర్ సందర్శించి ట్యాంకు పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ పనులను నిరంతరం చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక 7వ డివిజన్ కార్పొరేటర్ కిన్నెర మల్యాద్రి, నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.