*పారిశుద్ధ్య కార్మికురాలు వనపర్తి.జయమ్మకు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం*

నెల్లూరు నగరపాలక సంస్థ భూగర్భ డ్రైనేజీ పారిశుద్ధ్య కార్మికురాలు వనపర్తి. జయమ్మకు అరుదైన గౌరవం లభించింది. ఈనెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయం వేడుకలలో పాల్గొనాల్సిందిగా ఆహ్వాన పత్రిక ఆమె అందుకున్నారు. ఆహ్వాన పత్రాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్., చేతుల మీదుగా ఆయన చాంబర్లో జయమ్మ మంగళవారం అందుకున్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎన్.ఎస్.కె.ఎఫ్.డి.సి. పథకం లబ్ధిదారునిగా జయమ్మ సెప్టిక్ ట్యాంక్ వాహనానికి యజమానిగా ఉంటూ, స్వయంకృషితో విధులు నిర్వహించడాన్ని, సాటి పారిశుద్ధ్య కార్మికులకు ఆదర్శంగా నిలవటాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని కల్పించిందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఆలోచనలతో దేశవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లలో గత మూడేళ్లుగా భూగర్భ డ్రైనేజీ పనులను మానవ రహితంగా, వాహనాల ద్వారా నిర్వహిస్తూ, పారిశుద్ధ్య కార్మికులను ఆయా వాహనాలకు యజమానులుగా అవకాశాన్ని కల్పించడం మంచి ఫలితాలను రాబట్టిందని కమిషనర్ వెల్లడించారు.

గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 26 వ తేదీనగణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి భవన్ లో అందించనున్న విందులో పాల్గొనే గొప్ప అవకాశాన్ని నెల్లూరు నగరపాలక సంస్థ కార్మికురాలు జయమ్మ సాధించడం అందరికీ ఆదర్శనీయమని కమిషనర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్ మోహన్ రావు పాల్గొన్నారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *