పారదర్శకంగా వీధి వ్యాపారుల ఇంటర్వ్యూలు
– అదనపు కమిషనర్ నందన్
నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని జాఫర్ సాహెబ్ కాలువ నుండి మైపాడు గేటు వరకు తాత్కాలికంగా ఏర్పాటు చేయు షాపులకు దరఖాస్తులు చేసుకొన్న వీధి వ్యాపారులకు టౌన్ వెండింగ్ కమిటీ ఆధ్వర్యంలో పారదర్శకంగా ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నామని అదనపు కమిషనర్ నందన్ తెలియజేశారు. నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కమిషనర్ మాట్లాడుతూ ఇంటర్వ్యూలను 30, 31ఈ నెల తేదీలలో అనగా రేపు, ఎల్లుండి కూడా టౌన్ వెండింగ్ కమిటీ సభ్యులు నిర్వహిస్తారని తెలియజేసారు.
ఈ కార్యక్రమములో టౌన్ వెండింగ్ కమిటీ సభ్యులు, మెప్మా పి.డి.రాధమ్మ, బాలకృష్ణ, మదన్ మిశ్రా పాల్గొన్నారు.