*SPS నెల్లూరు జిల్లా*

*పారదర్శకంగా, నిష్పక్షపాతముగా పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు : -జిల్లా యస్.పి. శ్రీ జి. కృష్ణకాంత్,IPS.,*

 *ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు (APSLRB) ఆదేశాలు, నియమ నిబంధనలు మేరకు, బోర్డు వారు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఫిజికల్ మేజర్మెంట్ పరీక్ష(PMT), ఫిజికల్ ఎపిషయన్స్ పరీక్షలను(PET) పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు 30.12.2024 వ తేది నుండి 09.01.2025 వ తేది వరకు జరుగుచున్నట్లు వెల్లడి.*
 *జిల్లాలో 4690 మంది అభ్యర్థులలో 3,855 మంది పురుషులు, 835 మంది స్త్రీలు పాల్గొంటున్నట్లు వెల్లడి.*
 *పకడ్బందీగా శారీరిక దారుఢ్య పరీక్షలు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు సంసిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా యస్.పి. గారు.*
 *పోలీసు రిక్రూట్మెంట్ కి సంబంధించి విధి నిర్వహణలో పాల్గొననున్న పోలీసు అధికారులు, సిబ్బందితో విధి విధానాలు, పాటించవలసిన నియమాలు, జాగ్రత్తలు, బందోబస్తు తదితర అంశాలపై సమీక్ష నిర్వహణ.*
 *అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా, జిల్లాలో ప్రణాళికాబద్ధంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా ఏర్పాట్లు, నిర్వహణ చేపట్టేలా దిశానిర్ధేశం.*
 *సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదలు… బయోమెట్రిక్ అథెంటికేషన్ , ఫిజికల్ మెజర్మెంట్ పరీక్షలు, ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు( 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ ), వెరిఫికేషన్ – 2 (స్పెషల్ బెన్ఫిట్స్ & లోకల్ స్టేటస్ ), రిజల్ట్ కౌంటర్ వరకు అంచెలంచెలుగా సమగ్రంగా విధులు నిర్వర్తించేలా క్లుప్తంగా వివరణ.*
 *అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు, దేహ దారుడ్య పరీక్షల నిర్వహించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు, వైద్యపరమైన అంశాలలో పటిష్టమైనటు వంటి చర్యలు తీసుకున్నట్లు, అంబులెన్స్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడి.*
 *దేహదారుఢ్య పరీక్షలు వచ్చే అభ్యర్థులు తమతో పాటుగా ఈ క్రింది చెప్పబడిన ఒరిజినల్ మరియు అటెస్టడ్ జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా సమర్పించవసినదిగా తెలియచేయడమైనది.*

*ఒరిజినల్ సర్టిఫికట్ లు సమర్పించని యెడల వారి యొక్క అభ్యర్దిత్వం తిరస్కరించబడును మరియు వారికి సమయము ఇవ్వబడదు.*

1. అభ్యర్థుల SSC మరియు ఇంటెర్మీడియట్ ఒరిజినల్ మార్క్స్ లిస్ట్
2. డిగ్రీ మార్క్స్ లిస్ట్, ప్రొవిజినల్ లేదా ఒరిజినల్ డిగ్రీ సెర్టిఫికేట్
3. ఇటీవల తీసుకున్న కుల దృవీకరణ పత్రము. కమ్యునిటీ సర్టిఫికేట్(6 నెలలలోపు తీసుకుని ఉండాలి)
4. BC అభ్యర్ధులు క్రిమి లేయర్ సెర్టిఫికేట్.. నోటిఫికేషన్ విడుదల తేదీ తరువాత తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్ తప్పకుండ తీసుకుని రావాలి.
5. స్టడీ సర్టిఫికేట్స్ 4 వ తగతి నుండి 10 వ తరగతి వరకు.
6. ఒరిజినల్ NCC, ఆర్మీ , నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ సెర్టిఫికేట్ లు ఏ,బి,సి సెర్టిఫికేటేలు. సర్విస్ సర్టిఫికేట్ లు
7. ఒరిజినల్ ట్రైబ్ సర్టిఫికేట్ లు/ ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్.
8. పోలీసు ఎగ్జిక్టివి, చిల్డ్రన్ ఆఫ్ పోలీసు పర్సనల్.
9. ఎక్స్ సర్విస్ మెన్ సర్టిఫికేట్(సర్విస్ బుక్ తో పాటు), మెరిటోరియస్ స్పొర్ట్స్ సర్టిఫికేట్.
10. కాల్ లెటర్ లో తెలిపిన స్కోరు కార్డ్ (ఒరిజినల్ రిజల్ట్).
11. స్టేజ్-1 అప్లికేషన్
12. స్టేజ్-II అప్లికేషన్ లను తప్పనిసరిగా తీసుకొని రావాలి.

 *దేహదారుఢ్య పరీక్షలకు హాజరగు అభ్యర్ధులు వారి యొక్క వివరములు వెరిఫికేషన్ సమయములో అధికారులకు తెలియపరచాలి.*
 *కాల్ లెటర్ లో తెలిపిన తేదీ, సమయానికి అభ్యర్ధులు హాజరు కావాలి. నిర్ణీత సమయానికి అభ్యర్థి హాజరు కాని యెడల అభ్యర్థులను అనుమతించబడదు. స్నేహితులు, బంధువులు కుటుంబ సభ్యులను అనుమతించబడదు అభ్యర్థి ఒక్కరికి మాత్రమే మైదానంలోకి అనుమతి.*
 *పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు మైదానంలోకి ప్రవేశించినది మొదలుకుని, వారు దేహదారుఢ్య పరీక్షలు ముగించుకుని మైదానం నుండి తిరిగి వెళ్ళే వరకూ వారికి అర్థమయ్యే రీతిలో ప్రతి పరీక్ష ఘట్టాన్ని సూచించే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను సూచించారు.*
 *అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని, డబ్బులు ఇవ్వమని ప్రచారం చేసే వారి యొక్క సమాచారాన్ని డయల్ 112 లేదా స్థానిక పోలీసు వారికి తెలియ చేసిన యెడల వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము. సమాచారం అందించిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాము.*

జిల్లా పోలీసు కార్యాలయం, తేది.27.12.2024.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed