*పాపాలన్నీ పండే 11 సీట్లకు వైసీపీ*
*ఐదేళ్లూ ప్రజలకు చుక్కలు చూపించి…ఇప్పుడు పైనుంచి దిగొచ్చాననే భ్రమలో జగన్ రెడ్డి*
*టీడీపీ కూటమి ప్రభుత్వంలో మళ్లీ మొదలైన ప్రజాపాలన*
*వెంకటాచలం మండలం ఎగువమిట్టలో రూ.25 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లతో పాటు గోకులంను ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మళ్లీ ప్రజాపాలన మొదలైంది
ఎస్సీ, ఎస్టీ,బీసీలకు సబ్సిడీపై స్వయం ఉపాధి రుణాల పంపిణీ తిరిగి అమలులోకి వచ్చింది
2014-19 మధ్య అమలు చేసిన పథకాలన్నీ ఐదేళ్ల తర్వాత మళ్లీ అమలుకాబోతున్నాయి
స్వర్ణయుగం చూపించానని ప్రగల్భాలు పలుకుతున్న జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ప్రజలకు చుక్కలు చూపించారు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఆయన కాళ్ల కింద నలిగిపోయి ప్రజలకు స్వేచ్ఛ కరువైంది
లెక్కకు మించి పాపాలు చేసి ఇప్పుడు పైనుంచి దిగొచ్చినట్టు మాట్లాడుతున్నాడు
వైసీపీ పాలనలో పోలీసులు ఏ విధంగా ప్రవర్తించారో ప్రజలు ప్రత్యక్షంగా చూశారు.
రీసర్వే పేరుతో రైతుల భూరికార్డులను ఇష్టారాజ్యంగా మార్చేశారు. వైసీపీ నాయకులు చెప్పిన పేర్లను రికార్డుల్లో ఎక్కించేశారు..విస్తీర్ణాల నమోదులోనూ అన్నీ తప్పులే
ఐదేళ్ల పాటు చేసిన పాపాలన్నీ పండి వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది
దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు ఓడించినందుకు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి రియలైజ్ కావాలి
జగన్మోహన్ రెడ్డిలో పశ్చాత్తాపం కనిపించడం లేదు. ఆయన డైలాగులు విని రాష్ట్రంలో భయపడే వారెవరూ లేరు
మళ్లీ ఏదో ఒక మాయ చేసి సీఎం సీట్లో కూర్చుని, మిగిలిన ప్రజల సంపదను కూడా కొట్టేయాలని కలలు కంటున్నాడు
నలుగురు సభ్యులున్న జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఎన్ని లక్షల చదరపు అడుగుల ప్యాలెస్ లు కావాలి
ఒక్క బెంగళూరు యల్లహంక ప్యాలెస్ నే 29 ఎకరాల్లో 1.10 లక్షల చదరపు అడుగులతో నిర్మించారు. తాడేపల్లి, లోటస్ పాండ్, పులివెందుల, ఇడుపులపాయలోనూ ప్యాలెస్ లు
అదే సమయంలో పేదలకేమో జగనన్న కాలనీల పేరుతో 9 అంకణాల్లో అత్యంత ఇరుకుగా, నాసిరకంగా ఇళ్లు కట్టేంచారు
ప్యాలెస్ లో మాత్రం బాత్రూములనే 20 అంకణాలకు పైగా విస్తీర్ణంలో కట్టుకున్నారు
ప్రజలు ఎటుపోయినా, ఏమైపోయినా పర్వాలేదు..తన ప్యాలెస్ లు బాగుంటే చాలనే ధోరణి జగన్మోహన్ రెడ్డిది
మద్యం పేరుతో భారీ స్కాము జరిగిందని, నెలకు రూ.300 కోట్లు వరకు దోచేశారని నేను ఎప్పటి నుంచి చెబుతూ వస్తున్నాను.. ఇప్పుడు విచారణ మొదలైంది
చేసిన ప్రతి పాపానికి శిక్ష అనుభవించక తప్పదు