*పాఠశాల విలీనం పై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి విద్యా శాఖాధికారులతో సమీక్ష*
– విద్యార్థులకు అసౌకర్యం లేకుండా పాఠశాలల విలీన ప్రక్రియ చేస్తాం.
– పాఠశాలల విలీనంలో తల్లితండ్రుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుంటాం.
– మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి సానుకూల పరష్కారానికి కృషి చేస్తా..
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
కోవూరు నియోజకవర్గంలో వివాద రహితంగా పాఠశాల విలీన ప్రక్రియ చేపడతామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని విపిఆర్ నివాసంలో నియోజజకవర్గ కోవూరు నియోజకపరిధిలోని ఐదు మండలాల విద్యాశాఖ అధికారులు మరియు విద్యార్థుల తల్లి తండ్రులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద G.O నెంబర్ 117 తో విద్యాశాఖలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక G.O నెంబర్ 117 రద్దు చేసింది. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో వివిధ గ్రామాలలో పాఠశాలల విలీనాలకు సంబంధించి వస్తున్న స్థానిక అభ్యంతరాలను విద్యాశాఖా అధికారులు ఆమె దృష్టికి తెచ్చారు. తల్లి తండ్రులు, మండల విద్యాశాఖా అధికారుల అభిప్రాయాలను తెలుసుకున్న ఆమె విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా వివాద రహితంగా పాఠశాల విలీన ప్రక్రియ చేపట్టాలని ఆమె సూచించారు. అవసరమైతే విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తెచ్చి కోవూరు నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం వున్న 345 పాఠశాలల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా డిప్యూటి విద్యాశాఖాధికారి వెంకటేశ్వర నాయక్, బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, టిడిపి నాయకులు బత్తుల హరికృష్ణ, ముంగమూరు శ్రీహరిరెడ్డి, బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, అడపాల శ్రీధర్ రెడ్డి, శ్యామ్ రెడ్డి జనసేన నాయకులు చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, మోర్ల మురళి తదితరులు పాల్గొన్నారు.