*పల్లెల్లో పండగలా పింఛన్ల పంపిణీ*
*తోటపల్లి గూడూరు మండలం సౌత్ ఆములూరు, ముంగలదొరువులో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయడంతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*సోమిరెడ్డి కామెంట్స్*
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ పండగలా సాగుతోంది
వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి రూ.15 వేలు అందజేస్తున్నాం
ఒక్క సౌత్ ఆములూరులోనే ఏడాదికి రూ.1.60 కోట్లు పింఛన్ రూపంలో పంపిణీ జరుగుతోంది
ఎన్టీఆర్ రూ.30తో పింఛన్ పథకాన్ని ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు మొదట రూ.70కి పెంచారు
ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200కి పెంచితే చంద్రబాబు నాయుడు మూడో సారి సీఎం అయ్యాకు మొదట రూ.1000, ఆ తర్వాత రూ.2000కి పెంచారు
రూ.2 వేలు నుంచి రూ.3 వేలకు పెంచేందుకు జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్లు పట్టింది
చంద్రబాబు నాయుడు నాలుగో సారి సీఎం అయిన వెంటనే ఒకే సారి రూ.1000 పెంచి రూ.4 వేలు ఇస్తున్నారు
మొత్తం రూ.4 వేలలో చంద్రబాబు నాయుడు పెంచిన మొత్తం రూ.2875
రాష్ట్ర వ్యాప్తంగా ఏటా రూ.33 వేల కోట్లతో పింఛన్ రూపంలో పేదలకు లబ్ధి చేకూరుస్తున్నారు