*పల్లా సింహాచలం గారి మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన బీద*
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి తండ్రి పల్లా సింహాచలం గారి మరణం విచారకరం.
పల్లా సింహాచలం గారు 1989 సం. నుండి తెలుగుదేశం పార్టీ కి సేవలను అందించారు. పార్టీ బలోపేతం కోసం శ్రమించారు.
1994 ఎన్నికల్లో విశాఖ పట్నం – 2 నియోజకవర్గం శాసన సభ్యులు గా పల్లా సింహాచలం గారు పోటీ చేసి గెలుపొందారు.
శాసనసభ్యులు గా పల్లా సింహాచలం గారు అనేక అభివృద్ధి పనులను నియోజకవర్గం లో చేపట్టి ప్రజల మన్ననలను పొందారు.
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా నాయకుడు, సౌమ్యుడు గా పల్లా సింహాచలం గారు గుర్తింపు పొందారు. వారు లేని లోటు పూడ్చలేనిది.
పల్లా సింహాచలం గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.