
*పర్యావరణహితం.. ప్రశాంతమ్మ జన్మదినం*
* అన్ని మండలాల్లో విస్తృతంగా మొక్కలు నాటిన కూటమి నాయకులు*
*ప్రశాంతమ్మ పిలుపుకు కదిలిన కోవూరు నియోజకవర్గం*
ఒక్క పిలుపు.. వందల మొక్కలకు ఊపిరిలిచ్చింది. పర్యావరణ పరిరక్షణకు బాసటగా నిలిచింది. తన జన్మదిన వేడుకలను ఆర్భాటాలకు దూరంగా, పర్యావరణహితంగా నిర్వహించాలని, మొక్కలు నాటాలని ఎమ్మెల్యే ప్రశాంతమ్మ నియోజకవర్గ నాయకులకు ఇచ్చిన పిలుపుతో నాయకులు, కార్యకర్తలు భారీగా స్పందించారు. శనివారం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో విస్తృతంగా మొక్కలు నాటి ప్రశాంతమ్మపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కొడవలూరు మండలం టీడీపీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, మల్లికార్జున్ తదితరులు రాజుపాలెం, అడ్డబజార్ వీధి తదితర ప్రాంతాల్లో ప్రశాంతమ్మ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు. టీడీపీ నాయకులు చెంచు కిషోర్, ఇతర నాయకులు పున్నూరులో, జగదేవిపేటలో ఇందుకూరుపేట మండలపార్టీ అధ్యక్షులు పవన్ కుమార్రెడ్డి మొక్కలు నాటి కేకు కట్ చేశారు.
అలాగే బుచ్చిరెడ్డిపాలెం ఛైర్పర్సన్ మోర్ల సుప్రజ ఆధ్వర్యంలో 4వ వార్డు, 3వ వార్డుల్లో కౌన్సిలర్లు శివారెడ్డి, ప్రత్యూష, ఇతర నాయకులు మొక్కలు నాటారు. కోవూరు మండలం గుమళ్లదిబ్బ గ్రామంలోని పాఠశాలలో మాజీ మండలపార్టీ అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, నాయకులతో కలిసి మొక్కలు నాటి కేకు కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ.. సేవలో నిబద్ధత, ప్రజల కోసం పోరాడే ధైర్యవంతురాలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అని కొనియాడారు. గడిచిన 17 నెలల్లో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా విపిఆర్ ఫౌండేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. నియోజవర్గంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లు ఉచితంగా ఉచితంగా నిర్వహించారని వెల్లడించారు. నియోజవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తూ పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. మెగా జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. టీటీడీ బోర్డు సభ్యురాలుగా శ్రీవారి భక్తులకు విశిష్ట సేవలు అందిస్తున్నారన్నారు. ప్రశాంతమ్మ ఆ భగవంతుడి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని ఉన్నత శిఖరాలు అదిరోహించాలని ఆకాంక్షించారు.