*పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి*
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. స్థానిక నాయకులను సమన్వయం చేసుకొని గ్రామాలను పరిశుభ్రంగా వుంచేదుకు వుంచేందుకు కృషి చేయాలన్నారు. కోవూరు నియోజకవర్గంలోని అధికారులను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ఆదేశించారు. డ్రైనేజి కాలువలలో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. నిర్దేశిత ప్రదేశాలలో మాత్రమే చెత్త వేసి పారిశుధ్య కార్మికులతో సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వీధుల్లో చెత్తా చెదారాలు పేరకు పోకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. పారిశుధ్య నిర్లక్ష్యం కారణంగా ప్రబలే అంటు వ్యాధుల గురించి ప్రజలకు వివరించాలని అధికారులకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సూచించారు. నిరంతర ఫాగింగ్ ద్వారా దోమల వ్యాప్తిని నియంత్రించాలని కోరారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి చొరవతో అప్రమత్తమైన పంచాయతి అధికారులు కోవూరు గ్రామంలో పారిశుధ్య చర్యలు చేపట్టారు.