*పరిసరాల పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*రోడ్లను విస్తరించడమే కాదు…మొక్కలు నాటడంపైనా ఆర్ అండ్ బీ శాఖ దృష్టి పెట్టాలి*
*సర్వేపల్లి నియోకవర్గంలో ప్రతి టీడీపీ నాయకుడు మొక్కలు నాటి పెంచే బాధ్యత తీసుకోవాలి*
*ప్రతి సచివాలయం ఉద్యోగి రెండు మొక్కలు నాటి పరిరక్షించాలి*
*తోటపల్లి గూడూరు మండలం నరుకూరులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేయడంతో పాటు మొక్కలు నాటిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*అందరితో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించిన సోమిరెడ్డి*
*మీడియాతో సోమిరెడ్డి కామెంట్స్*
టీడీపీ -జనసేన- బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాం
ప్రజలందరూ పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలని, బిడ్డలు బాగుండాలని, మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టాం
స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాను
ప్రతి పంచాయతీ పరిధిలో కనీసం ఇద్దరు నాయకులు కలిసి 10 మొక్కలు నాటడంతో పాటు పరిరక్షించే బాధ్యతలు చేపట్టాలని సూచిస్తున్నాను
రోడ్ల విస్తరణ సమయంలో పెద్దపెద్ద చెట్లను కొట్టేస్తున్నాం…తిరిగి నాటడం లేదు
నెల్లూరు –కోడూరు రోడ్డు విస్తరణ సమయంలో దశాబ్దాల నాటి పెద్దపెద్ద చెట్లను కోల్పోయాం
8
కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు నిర్మిస్తున్న ఆర్ అండ్ బీ శాఖ మొక్కలు పెంపకంపై దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరం
30 ఏళ్ల క్రితం నెల్లూరు – మైపాడు రోడ్డు పక్కన నాటిన మొక్కలు ఈ రోజు కోనసీమ ప్రాంతాన్ని తలపించేలా పెరిగాయి
సచివాలయ ఉద్యోగులు కూడా ప్రతి ఒక్కరూ కనీసం రెండు మొక్కలు చెప్పున నాటి పరిరక్షించాలి
పరిశుభ్రతతతో పాటు పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి