*పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం : సోమిరెడ్డి*
*టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న భూములను వినియోగంలోకి తెస్తాం*
*కాకాణి నిర్వాకంతో కంటైనర్ టెర్మినల్ తరలిపోయి రోడ్డున పడిన 10 వేల మంది ఉద్యోగులు*
*పోర్టులోని డర్టీ కార్గో నుంచి వెలువడుతున్న కాలుష్యం బారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించడమే ధ్యేయంగా పోరాటం*
*ముత్తుకూరు మండలం దొరువులపాళెం పంచాయతీ మిట్టపాళెంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
సర్వేపల్లి నియోజకవర్గంలో వేలాది ఎకరాల భూములు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో పరిశ్రమలు ఏర్పాటు చేయించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తా
రిలయన్స్ భూములు 2500 ఎకరాలు, కృష్ణపట్నం ఎస్ఈజెడ్ లో 6 వేల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. వెంకటాచలం మండలంలోనూ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భూములున్నాయి
కృష్ణపట్నం పోర్టు, జెన్ కో పవర్ ప్లాంటు, చెన్నై కోల్ కత్తా జాతీయ రహదారి, రైల్వేలైను తదితర సౌకర్యాలున్న ప్రాంతం ఇది
కృష్ణపట్నం పోర్టులో నుంచి కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకు తరలిపోవడం చాలా దురదృష్టకర పరిణామం. 10 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి టోలుగేటు తెరిచి మాఫియాను తయారుచేసి కంటైనర్ టెర్మినల్ తరలిపోవడానికి కారణమయ్యాడు
ముత్తుకూరు మండల ప్రజలకు డర్టీ కార్గో మాత్రమే మిగిలింది. కంటైనర్ టెర్మినల్ తరలిపోవడంతో ఖాళీగా ఉన్న బెర్తులను కూడా డర్టీ కార్గోకు వాడేస్తున్నారు
పోర్టు నుంచి వెదజల్లుతున్న కాలుష్యంతో ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బంది పడటంతో పాటు పొలాల్లో ధాన్యం దిగుబడి కూడా తగ్గిపోయింది. ఆక్వా సాగుపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది
సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యం
పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా పోర్టును కాలుష్యబరితంగా మార్చిన అదానీ యాజమాన్యంపై రాజీలేని పోరాటం సాగిస్తాం
10 వేల మంది ఉద్యోగుల నోటికాడి కూడు తీసేసిన అదానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైతే ఎవరికి ఉపయోగం
టోలుగేటు తెరిచిన కాకాణిపై కోపముంటే జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేయాలి కానీ ఏకంగా టెర్మినల్ నే ఎత్తేస్తేరా
6 వేల ఎకరాల భూములను పోర్టుకు త్యాగం చేసిన ప్రజలను ఈ రోజు కాలుష్యంలో మునగమనడం బాధాకరం
అదానీ, అంబానీ ఎవరికైనా సరే…ప్రజల హక్కులను హరించే రైట్ లేదు
టీడీపీ కూటమి అదికారంలోకి రాగానే యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తాం