పన్నుల వసూళ్లలో రెవెన్యూ విభాగం కృషి అభినందనీయం
– కమిషనర్ సూర్య తేజ
నెల్లూరు నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో 2024-25 ఆర్ధిక సంవత్సరం పన్నుల వసూళ్లలో విశేష కృషి చేసిన అధికారులు, సిబ్బంది సేవలు అభినందనీయం అని కమిషనర్ సూర్య తేజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పన్నుల వసూళ్లను కమిషనర్ వివరిస్తూ… గత ఏడాది ఏప్రిల్ నెల 1 వ తేదీ నుంచి 31-03-25 వ తేదీ వరకు ఆస్థి పన్ను మొత్తం రూ. 70,14,02,787/- కోట్లు కాగా, ఖాళీ స్థలం పన్నులు రూ. 7,62,06,972/- కోట్లు, తాగునీటి కుళాయి పన్ను రూ. 9,85,83,800/- కోట్ల రూపాయలను వసూలు చేశామని తెలిపారు. ఆస్థి పన్ను, ఖాళీ స్థలం పన్నులు మొత్తం కలిపి రూ. 77,76,09,759/- కోట్ల రూపాయలను వసూలు చేసారని తెలిపారు.
31-03-25 తేదీ ఒక్కరోజునే రూ. 2.85 కోట్ల రూపాయల పన్నులను వసూలు చేసి రెవెన్యూ విభాగం సత్తా చాటుకున్నారని కమిషనర్ ప్రశంసించారు.
గత ఏడాది ఆస్థి పన్ను, రూ. 58.58 కోట్లు, ఖాళీ స్థలం పన్ను రూ. 7.80/- కోట్లతో మొత్తం రూ. 66.38/- కోట్లు కాగా ఈ ఏడాది వసూళ్లలో రూ. 11.38/- కోట్లను అదనంగా వసూలు చేయడంలో డెప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ విభాగం అధికారి ఇనాయతుల్లా, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు, వారితోపాటు ఇంజనీరింగ్ అధికారులు , వార్డు సచివాలయ అడ్మిన్, అమెనిటీస్ కార్యదర్శులు చురుకుగా విధులను నిర్వర్తించారని కమిషనర్ అభినందనలు తెలిపారు.