*విద్యుత్ భవన్, మార్చి 5*

*పనితీరుని మెరుగుపరుచుకోండి.. ప్రభుత్వ లక్ష్యాలకు చేరువకండి*

*వినియోగదారునికి సంతృప్తికర సేవలే మన సంస్థ లక్ష్యం*

*విద్యుత్ స్తంభాలకు తీగలు అల్లుకొని ఉండడం మరియు పగటిపూట విద్యుత్ దీపాలు వెలగడం వంటివి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి*

*ట్రాన్స్ఫార్మర్ దిమ్మేలపై సంబంధిత లైన్ మ్యాన్ ఫోన్ నెంబర్లు వేయాలి*

ఈరోజు జిల్లాలోని ఇంజనీరింగ్ అధికారులు మరియు అకౌంట్స్ విభాగపు అధికారులతో జిల్లా ఎస్.ఈ. శ్రీ వి.విజయన్ గారు టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించడం జరిగింది.

ఈ టెలీకాన్ఫెరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రతి ఒక్క ఉద్యోగి వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించి సంస్థ కు మరియు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరడమైనది.

రాష్ట్రప్రభుత్వం వినియోగదారులకు అంతరాయలు లేని విద్యుత్ సరఫరా ను అందించాలనే లక్ష్యం తో పనిచేయాలని, వోల్టేజ్ సమస్యలు ఉండకూడదని, విద్యుత్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని మరియు రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ప్రజలకు మరింత చేరువ కావాలని ప్రభుత్వం తెలుపచున్నది అని దానికనుగుణంగా మన పనితీరు కూడ మెరుగు పరుచుకోవాలని తెలిపారు.

విద్యుత్ స్తంభాలకు తీగలు అల్లుకుని ఉన్నాయని వెంటనే వాటిని యుద్ధ ప్రాతిపదికను తొలగించాలని, పగటి పూట విద్యుత్ కాంతులు ఎక్కడ ఉండకూడదని ఆదేశించారు. ఇవ్వన్ని ఉద్యోగి పనితీరును నిర్దేశిస్తాయి అని కావున ప్రతిఒక్కరు పనితీరు లో మార్పు తెచ్చుకోవాలని తెలిపారు.

విద్యుత్ సిబ్బంది మీరు పనిచేసే ప్రదేశంలో మీ ఫోన్ నెంబర్ వినియోగదారులకు అందరికీ తెలిసేలా ట్రాన్స్ఫార్మర్ దిమ్మేల మీద మీ ఫోన్ నెంబర్ ను వేయాలని తెలిపారు. దీనివల్ల విద్యుత్ పరంగా ఏ సమస్య వచ్చినా వినియోగదారుడు వెంటనే మీకు ఫోన్ చేయగలరని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed