ఏపీలో తొలిసారి మంత్రి, హోంమంత్రి కూడా అయిన వంగలపూడి నిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలల కూటమ పాలనలో తన పనితీరు కంటే ఎక్కువగా చర్చనీయాంశగా మారిన తన పీఏ సంధు జగదీష్ ను ఎట్టకేలకు దిలించుకున్నారు. పదేళ్లుగా తన వద్దే ఉంటున్న జగదీష్ చేసన అక్రమాలన్.. తాజాగా ఆయనకు చెక్ పెట్టేశారు. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది
అనకాపల్లి జిల్లా పాయకరావు పేట ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పదేళ్ల క్రితం సంధు జగదీష్ అనే వ్యక్తిని పీఏగా నియమించుకున్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఓడినా టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉండగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంత్రి అయ్యాక కూడా అతనిని పీఏగా కొనసాగించారు. ఇదే అదనుగా సంధు జగదీష్ అనే వ్యక్తి అవినీతి ఆనకొండగా మారిపోయాడు. వసూళ్లు, బెదిరింపులు, సెటిల్మెంట్లు ఇలా జగదీష్ చేయని పని లేదు. చివరికి టీడీపీలో ఇతని వ్యవహారం నచ్చక మీటింగ్ పెట్టుకున్న అనిత అనుచరుల్ని కూడా బెదించాడు. దీంతో అతని పాపం పండింది.
కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా జగదీష్ దందాలు సాగాయి. పాయకరావుపేటలో పేకాట శిబిరాల నిర్వహణ, మద్యంలో షాపుల్లో వచ్చే ఆదాయంలో వాటా కోసం ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, హోంమంత్రి కోటాలో వచ్చిన తిరుమల దర్శనం టికెట్లు తిరుపతిలో ఓ హోటల్ కు అమ్మేయడం ఇలా జగదీష్ చేయని పాపాలు లేవు. ఇంత జరుగుతున్నా హోంమంత్రి పట్టించుకోకుండా అతన్ని కొనసాగించడంతో ఈ పాపాల్లో ఆమెకూ వాటా ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అంతకు మించి ప్రభుత్వానికి ఎన్నో ఫిర్యాదులు అందాయి. దీంతో అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో జగదీష్ ను అనిత వదిలించుకున్నట్లు తెలుస్తోంది