*పదవులు శాశ్వతం కాదు, ప్రజాసేవే ముఖ్యమంటూ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు*
భారతీయ జనతా పార్టీ ,నెల్లూరు జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తన హయాంలో నెల్లూరు జిల్లాలో అభివృద్ధి కొరకు తీసుకున్న చర్యలను వివరించారు. నెల్లూరులోని మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశానని,ఆత్మకూరులో వంద పడకల ఆసుపత్రి మరియు రెండు రెవిన్యూ డివిజన్లతో పాటు జిల్లాలో రెండు మున్సిపాలిటీల స్థాపనలను ఆయన ప్రస్తావించారు.
నేనూ ముఖ్యమంత్రి హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రి అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. పదవులు పొందడం, కోల్పోవడం నుదుటి రాతే తప్ప మన చేతుల్లో లేదని, పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని ఆయన అన్నారు.తనకు ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే సీటు ఇవ్వబోతున్నారన్న ప్రచారాన్ని ఖండించారు. తన హోదాకు తగిన ప్రశ్నలు అడగాలని సూచించారు.”జీవితంలో ఏ పదవి శాశ్వతం కాదు, కేవలం ‘మాజీ’ అనేది మాత్రమే శాశ్వతం” అని చమత్కరించారు.తగిన సమయంలో బీజేపీ నాయకులుగా ప్రజల ముందుకు వస్తామని, జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్ విభజన త్వరలోనే జరగనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు శీపరెడ్డి వంశీధర్ రెడ్డి, జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు , వాకాటి నారాయణరెడ్డి,బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ ,ఆంజనేయ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పెంచలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు యరాబోలు రాజేష్, యశ్వంత్ సింగ్, ఇండ్ల రాఘవేంద్ర , మoడ్ల ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శిలు పరుశురాం , దాసరి ప్రసాద్ ,చిలకా ప్రవీణ్, గుత్తా అశోక్ నాయుడు, ప్రసాద్, పొట్లూరు శ్రీనివాసులు, ముక్కు రాధాకృష్ణ గౌడ్, మళ్లీ రవి ,పద్మ, చిలకల ప్రవీణ్ రెడ్డి, రాములు ,ధనుష్, పిడుగు లోకేష్ ,ముని, తదితరులు పాల్గొన్నారు