*పచ్చటి పొలాలను ధ్వంసం చేస్తూ పైపు లైను నిర్మాణం*

*బీపీసీఎల్ ప్రతినిధులపై ఎమ్మెల్యే సోమిరెడ్డి అసహనం*

*పంట చేతికొచ్చే సమయంలో 18 మీటర్ల వెడల్పున పైరును తొక్కేయడంపై ఆగ్రహం*

*వరికోతలు పూర్తయ్యేంత వరకు వేరే చోట పనులు చేసుకోవాలని సూచన*

*తోటపల్లి గూడూరు మండలం పేడూరులో బీపీసీఎల్ పైపులైను నిర్మాణంతో ధ్వంసమైన వరిపైరును పరిశీలించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*పైపులైను నిర్మాణం కారణంగా ఎదురవుతున్న కష్టనష్టాలను వివరించి బోరుమన్న అన్నదాతలు*

*చేతికొచ్చిన పంటను నాశనం చేస్తుండటంతో నిండా మునిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన కౌలు రైతులు*

*మీడియాతో సోమిరెడ్డి కామెంట్స్*

కృష్ణపట్నం – హైదరాబాద్ బీపీసీఎల్ పైపులైను నిర్మాణ పనులను పేడూరు పొలాల్లో చేపట్టారు

సుమారు 2 అడుగుల డయాతో ఉన్న పైపుల ఏర్పాటు కోసం చేతికొచ్చిన పంటను ధ్వంసం చేయడం దుర్మార్గం

మరో 10 రోజుల్లో వరికోతలు మొదలై, మార్చి 15వ తేదీ నాటికి దాదాపుగా పూర్తవుతాయి

2002లో రైతులకు నోటీసులిచ్చిన బీపీసీఎల్ అధికారులు ఇప్పుడొచ్చి చదరపు మీటరు పంటకు రూ.30 పరిహారం ఇస్తామంటూ పైరును ధ్వంసం చేయడం సరికాదు

18 మీటర్ల వెడల్పుతో జరుగుతున్న పైపులైను నిర్మాణ పనుల కారణంగా పొలాల మధ్య సాగునీటి సరఫరా నిలిచిపోవడంతో పాటు వరికోతలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఎకరాకు రూ.35 వేలు వరకు పెట్టుబడి పెట్టడంతో పాటు కౌలు రూ.30 వేలు చెల్లించిన కౌలు రైతుల పరిస్థితి ఏంటి

ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టిన బీపీసీఎల్ ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం కాదు..కానీ రైతుల ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి

సీజన్ కు ముందే పొలాల్లో మార్చింగ్ చేసివుంటే పైపులను నిర్మాణ ప్రాంతంలో రైతులు నారేత వేయకుండా వదిలేసివుండే వారు కదా

ఇప్పుడు పెట్టుబడి పూర్తిగా పెట్టేసి పంట చేతికొచ్చే సమయంలో పనులు చేస్తాననడం సరికాదు

కృష్ణపట్నం పోర్టు, ఏపీ జెన్ కో, సెంబర్ కార్ప్ తదితర ఎన్నో ప్రాజెక్టులతో పాటు ఎస్.ఈ.జెడ్ లకు వేలాది ఎకరాలు సేకరిస్తే రైతులు సహకరించారు

అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరించడం బాధాకరం

రైతుల కష్టాలను పరిగణనలోకి తీసుకుని మార్చి 15 తర్వాత ఈ ప్రాంతంలో పనులు చేసుకోవాలని సూచిస్తున్నాం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed