*పండుగలా బిజెపి ఆవిర్భావ దినోత్సవం*
*సిద్ధాంత పోరాటానికి మేము సైతం సిద్ధం కార్యకర్తల ప్రతిజ్ఞ*
మూలపేట ఇరుగోళ్ళమ్మ ఆలయం వద్ద పార్టీ45వ ఆవిర్భావ దినోత్సవం పండుగ వాతావరణంలో జరిగింది.
150 మంది కార్యకర్తలు సిద్ధాంత పోరాటానికి మేము సైతం సిద్ధం నినాదాలతో నూతన బిజెపి జెండా ఆవిష్కరించారు
జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా బిజెపి జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి. నమామిగంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ దేశం మొత్తం మీద 40 సంవత్సరాలుగా బిజెపి కార్యకర్తలు సిద్ధాంత భూమికగా పనిచేసే నందు న ఈరోజు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
చిత్త శుద్ధితో అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తుండడంతో మోడీ సర్కార్ మూడవ పర్యాయం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో వాడవాడల బిజెపి బలపడేలా కృషి చేస్తున్నామని అన్నారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కావేటి శిరీష మహిళా అడ్వకేట్ సురేష్ రెడ్డి సమక్షంలో బిజెపి సభ్యత్వం తీసుకొన్నారు పార్టీ అభివృద్ధికి తమ వంతుకృషి చేస్తామని ఆమె తెలిపారు
ఈ కార్యక్రమంలో ఏవి రమణయ్య. గంగుల జనార్ధన్ యాదవ్.అల్లూరు నాగేంద్ర సింగ్. చిత్తాతూర్ పద్మావతి. నాగలక్ష్మి. మనో శ్రావ్య. మురుగ నరేష్ .ఏవి సుబ్బయ్య. కే శివకుమార్ .వి సెట్టయ్య. చిలకా ప్రవీణ్ జె సంధ్య.కళ్ళు సరస్వతి. జే సంధ్య. విజయలక్ష్మి గండవరం విజయ. ఓజిలిసుధాకర్. మిడతల సుప్రియ తదితరులు పాల్గొన్నారు
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రజలకు ప్రసాదాలు పానకం పంపిణీ చేశారు.