- నేహారెడ్డి సమక్షంలో వైఎస్సార్సీ లో చేరిన టీడీపీ నేతలు
ఇందుకూరుపేట, మే 8, వైఎస్సార్సీపీ యువనేత, పార్టీ నెల్లూరు లోక్ సభ అభ్యర్థి విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి సమక్షంలో కొత్తూరు చింతోపు గ్రామ మాజీ సర్పంచ్, టీడీపీ నేత, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కటారి మస్తాన్, అతని అనుచరులు కుటుంబాలతో సహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేకు మద్దతుగా గ్రామంలో బుధవారం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన ఆమెను కలిసి మస్తాన్ అతని అనుచరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని వారికి భరోసా కల్పిస్తూ, పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి,.ఎమ్మెల్యే అభ్యర్ధి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో వారంతా ఆమెవెంట నడుస్తూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, చింతోపు గ్రామ సర్పంచ్ పెరుమారెడ్డి అరుణ, వైస్ ప్రెసిడెంట్ పెరుమారెడ్డి విజయరాఘవ రెడ్డి, కోటారెడ్డి, రాజీవలోచన రెడ్డి తదితరులు పాల్గొన్నారు