*నేలటూరు ఫిషింగ్ జెట్టీ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేయిస్తాం* *మరో జెట్టీ నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు* *ముత్తుకూరు పంచాయతీని దత్తత తీసుకున్న అదానీ కృష్ణపట్నం పోర్టు కంపెనీకి ధన్యవాదములు* *రూ.1.30 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఆరోగ్య కేంద్రాలకు పరికరాలు అందిస్తున్న SEIL కంపెనీకి అభినందనలు* *అన్ని కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధుల్లో 80 శాతం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల కోసమే ఖర్చుపెట్టాలి* *ముత్తుకూరు మండలం నేలటూరు పంచాయతీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఫిషింగ్ జెట్టీని అదానీ కృష్ణపట్నం పోర్టు ప్రతినిధులతో కలిసి పరిశీలించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

Byjanahushaar.com

Apr 2, 2025

*నేలటూరు ఫిషింగ్ జెట్టీ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేయిస్తాం*

*మరో జెట్టీ నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు*

*ముత్తుకూరు పంచాయతీని దత్తత తీసుకున్న అదానీ కృష్ణపట్నం పోర్టు కంపెనీకి ధన్యవాదములు*

*రూ.1.30 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఆరోగ్య కేంద్రాలకు పరికరాలు అందిస్తున్న SEIL కంపెనీకి అభినందనలు*

*అన్ని కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధుల్లో 80 శాతం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల కోసమే ఖర్చుపెట్టాలి*

*ముత్తుకూరు మండలం నేలటూరు పంచాయతీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఫిషింగ్ జెట్టీని అదానీ కృష్ణపట్నం పోర్టు ప్రతినిధులతో కలిసి పరిశీలించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*సోమిరెడ్డి కామెంట్స్*

కృష్ణపట్నం రేవు ద్వారా గతంలో ఈ ప్రాంత మత్స్యకారులు చేపల వేట సాగించేవారు

ఓ వైపు పోర్టు, మరోవైపు థర్మల్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుతో మత్స్యకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు

అదానీ కృష్ణపట్నం పోర్టు కంపెనీ ఇచ్చిన హామీ మేరకు రూ.17 కోట్లతో ఫిషింగ్ జెట్టీ నిర్మాణం చేపట్టారు

ఏపీ మారిటైం బోర్డుతో చేసుకున్న ఒప్పందం మేరకు 300 మీటర్ల బ్రేక్ వాటర్ సామర్ధ్యంతో 180 మీటర్ల పొడవైన జెట్టీ నిర్మాణం జరుగుతోంది

జెట్టీ నిర్మాణం పూర్తికావడానికి మరో రూ.15 కోట్లు అవసరమవుతుంది..దానిని ఏపీ మారిటైం బోర్డు భరిస్తుంది

మరో 10 రోజుల్లో ఆర్ అండ్ బీ, ఓడరేవుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో పాటు ఉన్నతాధికారులందరినీ ఇక్కడికి తీసుకొస్తాను

ఎన్నికల ముందు నుంచి ఆగిపోయిన జెట్టీ నిర్మాణ పనులను పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాను

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జెట్టీ ఒక్క నేలటూరు పంచాయతీ మత్స్యకారులకు మాత్రమే ఉపయోగపడుతుందని, మిగిలిన గ్రామాల వారి కోసం ఎదురుగా మరో జెట్టీ నిర్మించాలనే డిమాండ్ వచ్చింది

చిల్లకూరు, వాకాడు, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు మండలాల మత్స్యకారులతో పాటు కొడవలూరు, విడవలూరు మండలాలకు సంబంధించిన మత్స్యకారులకు ఉఫయోగపడేలా మరో జెట్టీ నిర్మాణానికి కృషి చేస్తాం

వేలాది కుటుంబాలు తమకు తాతముత్తాలు ఇఛ్చిన భూములు, ఆస్తులను ప్రాజెక్టుల నిర్మాణం కోసం అప్పగించి నిర్వాసితులయ్యారు

భూములను కోల్పోవడమే గాక కాలుష్యం బారిన పడుతున్నారు

నేలటూరు పునవాస కాలనీల నిర్మాణాలు గత ఐదేళ్లలో నిలిచిపోయాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే మళ్లీ పనులు మొదలుపెట్టాం

అదానీ కృష్ణపట్నం పోర్టు, SEIL కంపెనీ, ఏపీ జెన్ కోలు ఈ ప్రాంతానికి వచ్చాయని సంతోషించాలో, ఈ ప్రాంత ప్రజలు కష్టాలు పడుతున్నారని బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం

18 వేల మంది జనాభా కలిగిన ముత్తుకూరు మేజర్ పంచాయతీని దత్తత తీసుకున్న అదానీ కృష్ణపట్నం పోర్టు కంపెనీకి అభినందనలు

అలాగే అదానీ మంచి మనస్సుతో పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరించాలని కోరుతున్నాం…

వ్యవసాయ ఉత్పత్తులు, రొయ్యలు, చేపలతో పాటు ఇతర ఉత్పత్తులు, పరికరాల ఎగుమతులు, దిగుమతులకు పోర్టు ద్వారా అవకాశం కల్పించాలని విన్నవిస్తున్నాం

SEIL కంపెనీ సర్వేపల్లి నియోజకవర్గంలోని ఆస్పత్రులకు రూ.1.30 కోట్ల సీఎస్ఆర్ నిధులతో వివిధ రకాల పరికరాలు అందజేస్తుండటం ఆనందదాయకం. రెండు మూడు రోజుల్లోనే ఆరోగ్య కేంద్రాలకు ఆ పరికరాలు అప్పగించనున్నారు

ఆయా కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధుల్లో 80 శాతాన్ని ఈ ప్రాంత ప్రజల కోసం ఖర్చు చేయాలని విజప్తి చేస్తున్నాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed