*నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నారాయణ మాస్టారే : నారా లోకేష్*
– నెల్లూరుని అభివృద్ధి చేసింది నారాయణే…
– ఎంత అభివృద్ధి చేశారో ప్రజలందరికి తెలుసు
– అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు ఏర్పాటు చేశాం
– నిరుపేదల కోసం 43వేల టిడ్కో గృహాలను కట్టించాం
– పెండింగ్ పనులను పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం
– అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో నెల్లూరులో విమానం ల్యాండ్ చేస్తాం
– కేవలం ఒక్క నెల ఓపిక పట్టండి
– అధికారంలోకి వచ్చేది ఏన్టీఏ కూటమి ప్రభుత్వమే
– రాగానే…ఫస్ట్ సంతకం మెగా డీఎస్సీ పైనే
– పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి
– యువత భవిష్యత్‌కు చంద్రబాబే గ్యారెంటీ
– వైసీపీ భూస్థాపితం కోసమే పొత్తు…
– సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులపై సెటైర్లు
– విజయసాయిరెడ్డి ఏ2 అంటూ ధ్వజం
– వేమిరెడ్డి, నారాయణ, శ్రీధర్‌రెడ్డిలను గెలిపించాల్సిన బాధ్యత మనదే
– నెల్లూరు ప్రజాగళంలో యువతీ యువకులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖాముఖి
– యువత ప్రశ్నలకు లోకేష్ జవాబులు
– భారీగా తరలి వచ్చిన యువత
– యువతతో సెల్ఫీ దిగిన లోకేష్
– పాల్గొన్న వేమిరెడ్డి, నారాయణ, అజీజ్, కోటంరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, తాళ్లపాక, పట్టాభిరామిరెడ్డి, రూప్‌కుమార్ యాదవ్, గిరిధర్‌రెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు
– నెల్లూరులో యువగళం సక్సెస్
నెల్లూరు వీఆర్సీ మైదానంలో యువగళం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విచ్చేశారు. ఈ సందర్భంగా లోకేష్ కి… ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనూరాధ, టీడీపీ నేతలు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, రూప్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు ఘన స్వాగతం పలికారు. యువగళం కార్యక్రమానికి భారీగా యువతీ యువకులు తరలి వచ్చారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే…మాజీ మంత్రి పొంగూరు నారాయణ నాయకత్వంలో నెల్లూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఎంత అభివృద్ధి చేశారో కూడా ప్రజలందరికి బాగా తెలుసున్నారు. ముఖ్యంగా దోమలు లేని నెల్లూరు నగరంగా మార్చేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టును తీసుకువచ్చారన్నారు. అలాగే నిరుపేదల కోసం 43వేల టిడ్కో గృహాలను హై టెక్నాలజీ తో నిర్మించారన్నారు. కానీ ఆ తరువాత వచ్చిన దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేకపోయిందని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే… మూడేళ్లలో నెల్లూరులో విమానం ల్యాండ్ చేస్తామని యువతకు లోకేష్ హామీ ఇచ్చారు. ఒకే ఒక్క నెల మాత్రమే ప్రజలందరూ ఓపిక పట్టాలని…అధికారంలోకి వచ్చేది ఎన్టీఏ కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే…ఫస్ట్ సంతకాన్ని సీఎంగా చంద్రబాబునాయుడు మెగా డీఎస్సీ ఫైల్ పైనే చేస్తారని భరోసా ఇచ్చారు. యువత భవిష్యత్ చంద్రబాబు నాయుడే గ్యారెంటీ అన్నారు. అదే విధంగా నెల్లూరులో ఆగిపోయిన పెండింగ్ వర్క్ లన్నీ నారాయణ పూర్తి చేస్తారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం భూస్థాపితం కోసమే…పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే…అందుకే మా నారాయణ మాస్టారే కారణమన్నారు. నాకు ఎంతో నేర్పించారని కొనియాడారు. మా నారాయణ మాస్టార్ని…భారీ మెజారిటీతో గెలిపించాలని యువతను ఆయన కోరారు. రానున్న మన ప్రభుత్వంలో… తాడేపల్లి కార్పొరేషన్ని, నెల్లూరు కార్పొరేషన్ని ఇద్దరం పోటీ పడి మరి అభివృద్ధి చేస్తామన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సొంత నిధులతోపాటు…రాజ్యసభ నిధులను కూడా భారీగా తీసుకువచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం విధానాలు నచ్చకనే టీడీపీలోకి వచ్చారన్నారు. వేమిరెడ్డిని ఎంపీగా కూడా ప్రజలందరూ అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలానో… నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ అలా అన్నారు. త్రిబుల్ ఇంజన్ ఉంటే ఎంత స్పీడ్ ఉంటుందో మీ అందరికి తెలుసని…అందుకే ఈ ముగ్గురు మీ ముందున్నారని…వారిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. యువత ముఖాముఖి కార్యక్రమంలో… యువతీ యువకులు పలు ప్రశ్నలను వేశారు…వాటన్నింటిని నారా లోకేష్ సమాధానాలు చెప్పారు. యువగళంలో… సీఎం జగన్, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. నెల్లూరు వైసీపీ ఎంపీగా పోటీ చేస్తోన్న విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చివరగా… లోకేష్, నారాయణ, వేమిరెడ్డి, కోటంరెడ్డిలు…యువతతో సెల్ఫీ దిగారు. దీంతో… వీఆర్సీ మైదానం…యువత ఈలలు…కేకలతో దద్దరిల్లిపోయింది.