
*నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలి.*
*… కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి,*
*నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా, రూరల్ శాసన సభ్యులు ఆహ్వానం మేరకు తొలిసారిగా అన్ని రాజకీయ పార్టీలతో కలసి అభివృద్ధి కార్యక్రమములో పాల్గొనడం ఆనందకరంగా ఉంది. ఇట్లాంటి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం*
*నెల్లూరులో గతంలోరాజకీయాలు హుందాగా ఉండేవి. ఆ లోపించిన హుందాతనాన్ని తిరిగి తీసుకొనిరవాలి అని కోరుకొనే వాడిని కాబట్టే ఈ అభివృద్ధి కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా హాజరు కావడం జరిగింది.*
*కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులలో పనిచేసిన వ్యక్తి, అందుకే మేము మా కాంగ్రెస్ శ్రీధరన్న గానే చూస్తాం.*
*ఒకప్పటి కాంగ్రెస్ వాదిగా శ్రీధర్ రెడ్డి గారిని విన్నవిస్తున్నా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ నేత మన నెల్లూరువాసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి మరణాంతరం ఇప్పటి వరకు నెల్లూరు టౌన్ లో ఆయన విగ్రహం లేక పోవడం శోచనీయం, నేను నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ గా గతములో కమీషనర్ గారికి లేఖ ఇవ్వడం జరిగింది. కావున అన్నీ పార్టీల నాయకులు కలసి, మన నెల్లూరు వాసిగా ఆయనని గౌరవించి విగ్రహ ఏర్పాట్లు చేయమని కోరడం జరిగింది.*
*నారపరెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి*
*నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు*