నెహ్రూ యువ కేంద్ర, ఎన్ ఏస్ ఏస్ సంయుక్త ఆద్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు
నెల్లూరు, జనవరి 12:
నెల్లూరు దర్గామిట్ట లో ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కళాశాలలో ఆదివారం నాడు స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలు ను నెహ్రూ యువ కేంద్ర, ఎన్ ఏస్ ఏస్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విక్రమ సింహపురి యునివర్సిటీ వైస్ ఛాన్సలర్ విజయ్ భాస్కర్ రావు పాల్గొన్నారు.. ముందుగా నెహ్రూ యువ కేంద్ర నెల్లూరు జిల్లా యువజన అధికారి ఆకుల మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 12వ తేదీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాము అని అని అన్నారు.. యువత ప్రతి ఒక్కరూ స్వామి వివేకానంద ను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని కోరారు.. అనంతరం ఏపీ మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ యువతకు స్వామి వివేకానంద జీవిత చరిత్ర ఒక ఆదర్శం అని అన్నారు. నేటి యువతకు ప్రతి ఒక్కరూ ప్రశాంతత జ్ఞానం అందిస్తుంది అని ప్రతి ఒక్కరూ స్వామి వివేకానంద నడిచినబాటలో నడవాలని తెలిపారు… ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్ ఏస్ ఏస్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ యువతకు కేంద్ర ప్రభుత్వం అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలానే ఎన్ ఏస్ ఏస్ చేస్తున్న కార్యక్రమాల గురించి పిల్లలకు వివరించారు.. ఈ కార్యక్రమం లో సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ ఆంథోనీ మేరీ మాట్లాడుతూ యువతకు ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్న నెహ్రూ యువ కేంద్ర , ఎన్ ఏస్ ఏస్ విక్రమ సింహపురి యునివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు ప్రత్యేకత కృతజ్ఞతలు తెలిపారు తెలిపారు.. ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా యువతలో కు మేలు జరుగుతుంది అని అన్నారు.. స్వామి వివేకానంద ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని ఆమె అన్నారు.. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా పాల్గొన్న విక్రమ సింహపురి యునివర్సిటీ వైస్ ఛాన్సలర్ విజయ్ భాస్కర్ రావు మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి స్వామి వివేకానంద, ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని అన్నారు. భారతదేశం లో జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి పిల్లలకు వివరించారు.. భారతదేశంలో యువతకు అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని , అలానే మన భారత్ దేశం అతి పురాతనమైన కట్టడాలు సింధు నాగరికత అభివృద్ధి చెందిన నగరాలు, ఇస్రో వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ లైవ్ లో విద్యార్దులు వీక్షించారు.. ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు , నెహ్రూ యువ కేంద్ర వారు, ఎన్ ఏస్ ఏస్ తదితరులు పాల్గొన్నారు…