
*నెల్లూరు 53 వ డివిజన్ లో మొంథా తుఫాన్ బాధితులకు *నిత్యవసర సరుకులు* మరియు*
*భోజనాలు* అందజేసిన.. ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
—————————-
నెల్లూరు 53వ డివిజన్ వెంకటేశ్వరపురం గాంధీ గిరిజన కాలనీ లో డివిజన్ ఇన్ చార్జ్ *వెంగళ్ రెడ్డి* గారి ఆధ్వర్యంలో , కోఆర్డినేటర్ పరంధామయ్య మరియు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తల తో కలిసి మొంథా తుఫాన్ కారణంగా ఇబ్బంది పడుతున్న *గిరిజన కుటుంబాలకు నిత్యవసర వస్తువులు*..
మరియు *ముంపు ప్రాంత నిర్వాసితులు అయిన 200 మందికి.. భోజనాలను* .. వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు అందజేశారు.
ఈ సందర్భంగా *బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు.*
అనంతరం *స్థానిక మహిళలు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని కలిసి.. తమ ప్రాంత ముంపు సమస్యకు.. శాశ్వత పరిష్కారం చూపే దిశగా.. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.*
*స్థానికుల విజ్ఞప్తి మేరకు.. ఆ ప్రాంతాన్ని చంద్రశేఖర్ రెడ్డి గారు పరిశీలించి.. ముంపు సమస్య లేకుండా.. శాశ్వత పరిష్కారం లభించే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని స్థానికులకు హామీ ఇచ్చారు.*
*పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* మాట్లాడుతూ..
• మొంథా కారణంగా నెల్లూరు నగర నియోజకవర్గం లో.. అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు.
• ముఖ్యంగా 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీ లో గిరిజనుల ఇళ్లలోకి నీరు చేరి.. వారికి తాగేందుకు.. మంచినీరు కూడ కరువైందన్నారు.
• ఈ పరిస్థితుల్లో తుఫాన్ కారణంగా ఇబ్బంది పడుతున్న సమయంలో బాదితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ .. ఆహారం అందజేయడం జరిగిందన్నారు.
• *ఈ రోజు గాంధీ గిరిజన కాలనీ బాధితును ఆదుకునే దిశగా.. డివిజన్ ఇంచార్జ్ వెంగల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో . బాధిత ప్రజలకు బియ్యం తో పాటు 5 రకాల నిత్యవసర వస్తువులు* కూడా అందజేయడం జరిగిందన్నారు.
• రాజకీయాలకతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్న ముందుండి.. సేవలందిస్తుందని తెలిపారు.
• ప్రభుత్వం కూడా బాధితులకు.. అండగా నిలిచి వారి సమస్యలకు.. శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెర్నెటి కోటేశ్వర రెడ్డి, డివిజన్ నేతలు ప్రసన్న కుమార్,శరత్,54 డివిజన్ వై సి పి నేతలు మస్తాన్, అస్లాం, సలాం మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.