- *నెల్లూరు సిటీ నియోజకవర్గం 4 మరియు 9 డివిజన్స్ సిపిఎం శాఖ సభ్యుడు కామ్రేడ్ బాణాల.వెంకటేశ్వర్లు మృతికి నివాళులర్పించిన సిపిఎం నాయకులు*
***************************
* భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీనియర్ సభ్యుడు కామ్రేడ్ బాణాల వెంకటేశ్వర్లు హఠాత్తుగా గుండె పోటుతో మరణించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ నాలుగో మరియు 9 డివిజన్స్ శాఖ సభ్యులుగా కామ్రేడ్ బాణాల వెంకటేశ్వర్లు ఉన్నారు. నవ పేట ప్రాంతంలోని బంగ్లా తోట వారి స్వగృహం వద్ద అంత్యక్రియలు సందర్భంగా సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ , జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఎం. మోహన్ రావు, సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మరియు నగర నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. బాణాల వెంకటేశ్వర్లు మృతదేహం పై అరుణ పతాకాన్ని కప్పి జోహార్లు అర్పించారు.
* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు సిటీ కమిటీ పరిధిలో ఐరన్ మొబైల్ వర్కర్స్ యూనియన్ నగర నాయకులుగా కామ్రేడ్ బాణాల వెంకటేశ్వర్లు అనేక సంవత్సరాలు పనిచేశారని అన్నారు. బంగ్లా తోట ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమ కార్యకర్తగా నిజాయితీగా పని చేశారని అన్నారు. బాణాల వెంకటేశ్వర్లు లాంటి సభ్యులు పార్టీకి ఆస్తి అని తెలిపారు. స్వార్థపూరిత రాజకీయాలు నడుస్తున్న నేటి తరుణంలో కమ్యూనిస్టు ఉద్యమంలో నిజాయితీగా పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు.
* నివాళులు అర్పించిన వారిలో సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి వర్గ సభ్యులు జీ నాగేశ్వరరావు నగర కమిటీ సభ్యులు బీపీ నరసింహ, మూలం ప్రసాద్,షేక్ జాఫర్, ఆవాజ్ నగర కార్యదర్శి షేక్. రియాజ్,శాఖా కార్యదర్శులు షేక్. రవుఫ్, ఎం. శ్రీనివాసులు, ఎం. అశోక్ స్థానిక నాయకులు సలాం, రవుఫ్, చిరంజీవి, సురేంద్ర తదితరులు వున్నారు.