*నెల్లూరు సర్కారీ బడులకు ‘కార్పొరేట్’ కళ.*

*బీవీఎస్ హైస్కూల్ ఆధునీకరణకు శ్రీకారం*

*నెల్లూరులో 1.40 కోట్లతో బీవీఎస్ హైస్కూల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన*

*పేద పిల్లలకు విద్యే ఆస్తి.. మంత్రి నారాయణ*

*మూడేళ్లలో నెల్లూరు సిటీ రూపురేఖలు మారుస్తా – మంత్రి నారాయణ ధీమా*.

*15 ప్రభుత్వ హైస్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్న మంత్రి నారాయణ.*

  1. *ఇచ్చినవే కాకుండా.. ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్నాం – మంత్రి నారాయణ.*

నెల్లూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా మంత్రి నారాయణ సరికొత్త శకానికి శ్రీకారం చుట్టారు. స్టోన్ హౌస్ పేటలోని చారిత్రాత్మక బీవీఎస్ హైస్కూల్ ఆధునీకరణ కోసం తొలివిడతగా 1.40 కోట్ల సీఎస్ఆర్ నిధులతో శంకుస్థాపన చేసిన ఆయన, రెండో విడతలో మరో 7 కోట్లతో 24 అదనపు తరగతి గదులను నిర్మిస్తామని ప్రకటించారు. యువనేత లోకేష్ విజన్ ప్రకారం విద్యతోనే పేదరికాన్ని నిర్మూలించాలని, సిటీలోని 15 ప్రభుత్వ హైస్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నాలెడ్జ్ హబ్స్ గా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. అంగన్‌వాడీల బలోపేతం, వీఆర్సీలో డైనింగ్ హాల్ ప్రారంభంతో పాటు, ఇచ్చిన హామీలతో ,ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తూ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు . రాబోయే మూడేళ్లలో నెల్లూరు ముఖచిత్రాన్ని మార్చేస్తానని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.ఈ నెల 30న నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల పంపిణీకి, ఒకటో తేదీన వింజమూరులో పెన్షన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు నాయుడు గారు రానుండటంతో ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ ,జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీరావు ,మేయర్ సుజాత అశోక్ ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ,టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు విజేతా రెడ్డి ,నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ,టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి ,7&9 డివిజన్ల క్లస్టర్ ఇంచార్జ్ బాలాజీ, 7వ డివిజన్ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి,స్థానిక నేతలు కొండ స్వామి,కిన్నెర సాగర్
,కొండప్రవీణ్,పృథ్వి,బ్రహ్మగుప్త,స్థానిక టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed