*నెల్లూరు రెడ్ క్రాస్ పై మంత్రి నారాయణ చేస్తున్న కుట్రలతో రెడ్ క్రాస్ సంస్థ ప్రతిష్ట దెబ్బ తినకూడదన్న ఆలోచనతో రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను : నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*
—————————————-
నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్ *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* మీడియా సమావేశం నిర్వహించి సంచలన విషయాలను వెల్లడించారు..
👉 *గత నాలుగేళ్లగా నెల్లూరు రెడ్ క్రాస్ ద్వారా పేద ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని రెడ్ క్రాస్ చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు .*
👉 *దేశంలో ఎక్కడా లేనివిధంగా నెల్లూరు రెడ్ క్రాస్ 13 ప్రాజెక్టులతో ప్రజలకు విశేష సేవలందిస్తుందని తెలిపారు.*
👉 *రెడ్ క్రాస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి.. రెడ్ క్రాస్ కమిటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశామని తెలిపారు.*
👉 *కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రెడ్ క్రాస్ ద్వారా ముందుకొచ్చి ప్రజలకు ఎన్నో సేవలు చేయడం జరిగిందన్నారు.*
👉 రెడ్ క్రాస్ కమిటీ ద్వారా క్యాన్సర్ హాస్పిటల్ అభివృద్ధి, బ్లడ్ బ్యాంక్ ఆధునీకరణ, తల సేమియా క్లినిక్ ఏర్పాటు, రెడ్ క్రాస్ స్పాస్టిక్ సెంటర్లో.. మానసిక దివ్యాంగులైన చిన్నారులకు ఉచిత బస్సు, ఉచిత భోజన వసతి.. ఏర్పాటు చేశామని తెలిపారు.
👉 *ప్రస్తుతం మంత్రి నారాయణ రెడ్ క్రాస్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.*
👉 *అందుకు ప్రత్యక్ష ఉదాహరణ తానేనని పేర్కొన్నారు.*
👉 *నారాయణ హాస్పిటల్ వారికి అనుమతులు లేనప్పటికీ .. రెడ్ క్రాస్ ద్వారా ఒప్పందం కుదుర్చుకోని .. క్యాన్సర్ వైద్యశాల ఏర్పాటు చేయాలని భావించి తనను సంప్రదించారని తెలిపారు.*
👉 *నారాయణ హాస్పిటల్ వారికి క్యాన్సర్ హాస్పిటల్ కు ఆరోగ్యశ్రీ అనుమతులు సంవత్సరం వరకు వచ్చే అవకాశం లేదని తెలిపారు.*
👉 *అందుచేత రెడ్ క్రాస్ ద్వారా ఒప్పందం కుదుర్చుకొని.. క్యాన్సర్ చికిత్స అందిస్తున్నట్లు చూపి ఆరోగ్యశ్రీ కోసం నారాయణ హాస్పిటల్ వారు సిద్ధపడ్డారని ఆరోపించారు.*
👉 *ఆపై కుట్రలు చేసి నన్ను రెడ్ క్రాస్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని మంత్రి నారాయణ రాష్ట్ర కమిటీ నుంచి ఆగ మేఘాల మీద ఆర్డర్స్ తీసుకువచ్చారని తెలిపారు.*
👉 *అయితే వారు తీసుకొచ్చిన ఆర్డర్స్ రెడ్ క్రాస్ లో ఎక్కడ చెల్లుబాటు కావని పేర్కొన్నారు.*
👉 *ఈ విషయంపై నిన్నటి రోజున కలెక్టర్ గారిని కలిసి రెడ్ క్రాస్ లో కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని పూర్తి చేసి జనవరి నెల చివరి నాటికి తానే స్వచ్ఛందంగా రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని తెలియజేశానని చెప్పారు.*
👉 *అలాగేనని ఒప్పుకున్న కలెక్టర్ గారు.. ఈరోజు సాయంత్రం మేనేజ్మెంట్ కమిటీతో సమావేశం నిర్వహించారన్నారు .*
👉 *నావల్ల రెడ్ క్రాస్ కు ఎలాంటి ఇబ్బంది రాకూడదు.. రెడ్ క్రాస్ ద్వారా పేద ప్రజలకు అందుతున్న సేవలు ఎక్కడ నిలిచిపోకూడదు అన్న ఉద్దేశంతో తాను రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.*
👉 *నా రాజీనామా పత్రాన్ని ఈరోజు సాయంత్రం మేనేజ్మెంట్ కమిటీకి అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.*
👉 *తాను రాజీనామా చేసినప్పటికీ.. రెడ్ క్రాస్ కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ.. రెడ్ క్రాస్ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు.*