నెల్లూరు

యువత మార్పు కోరుతున్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ఉపానెనెల్లూరుల్లూరుధి కరువై వలస బాట పడుతున్న యువతకు ఉద్యోగవకాశలు కల్పించే సామర్ధ్యం చంద్రబాబు నాయిడు గారికి మాత్రమే ఉందన్నారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. కొడవలూరు మండలంలోని కమ్మపాలెం, పెయ్యలపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి జనం బ్రహ్మరధం పట్టారు.
స్థానిక టిడిపి మిత్రపక్ష బిజెపి జనసేన కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించిన ప్రశాంతి రెడ్డి గారికి ప్రజలనుంచి అనూహ్య స్పందన వచ్చింది. తాగునీరు, డ్రైనేజి, రోడ్ల దుస్థితి పై స్థానికులు విన్నపాలను ఆలకించిన ప్రశాంతి రెడ్డి గారు.టిడిపి ప్రభుత్వం రాగానే గ్రామీణభివృద్ధికి పెద్ద పీట వేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న బాబు ష్యూరిటీ భవిషత్తు గ్యారంటి, సూపర్ సిక్స్ లాంటి సంక్షేమ పధకాలు ఆమె ప్రజలకు వివరించారు. టిడిపి సంక్షేమ పధకాలపై మహిళలలో సానుకూల స్పందన కనిపించింది. మీరందరు ఆశీర్వందించి కోవూరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సైకిల్ గుర్తు పై ఓట్లేసి NDA కూటమి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా తనను కోవూరు ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed