*నెల్లూరు మెడికవర్ లో ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు*
నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో మహిళలకు ఉచితంగా గర్భాశయ ముఖ ద్వారపు క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బింధురెడ్డి వెల్లడించారు. దీనికి సంభందించిన పోస్టర్ ను గురువారం కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వారి నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మెడికవర్ హాస్పిటల్ బృందాన్ని అభినందించారు. సామాజిక బాధ్యతలో భాగంగా క్యాన్సర్ పై అవగాహాన, నివారణే లక్ష్యంగా మెడికవర్ హాస్పిటల్స్ దేశ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బిందురెడ్డి వివరించారు. అందులో భాగంగా ఈ జనవరి నెలను సర్వైకల్ క్యాన్సర్ అవగాహన నెలగా పాటిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఈనెల 31వ తేదీ వరకూ 5100/- రూపాయల విలువైన సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మంచి కార్యక్రమం చేపట్టారంటూ కొనియాడారు.
మెడికవర్ హాస్పిటల్స్ మెడికల్ సూపరింటెంండెంట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ సతీష్ బాబు, పిఆర్వో చందు వర్మ, అర్జున్ రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు