తేది: 12-01-2025
నెల్లూరు
*నెల్లూరు పట్టణంలోని ఏపీ హరిత హోటల్ ఆకస్మిక తనిఖీ*
*హోటల్ నిర్వహణలో మెరుగుదలకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందించిన ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ*
*రాబోయే 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించిన ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ*
2025 జనవరి 12వ తేదీన, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ నెల్లూరులోని ఏపీ హరిత హోటల్‌కు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలో హోటల్ నిర్వహణ, పని తీరు తదితర వివిధ అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
తొలుత హోటల్ కి సంబంధించిన పూర్తి రికార్డులను పరిశీలించారు. ప్రత్యేకించి గత ఆరు నెలల రూమ్ ఆక్యుపెన్సీ గణాంకాలను లోతుగా అధ్యయనం చేశారు. అనంతరం, ప్రస్తుతం జరుగుతున్న హోటల్ ఆధునికీకరణ పనుల పురోగతిని సమీక్షించి, సంబంధిత అధికారుల నుండి వివరణాత్మక నివేదికను ఇమ్మని ఆదేశించారు.. హోటల్ పరిసరాల పరిశుభ్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు.
తనిఖీ సందర్భంగా చైర్మన్ పలు లోపాలను గుర్తించారు. ముఖ్యంగా హోటల్ రూమ్ ఆక్యుపెన్సీ రేటు 40 శాతం కంటే తక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొన్నారు. అదేవిధంగా రినోవేషన్ పనులు నిర్దేశిత వేగంతో జరగకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యం, హోటల్ నిర్వాహణలో గణనీయమైన లోపాలు ఉన్నట్లు గుర్తించారు.ఈ పరిస్థితిని సవరించేందుకు చైర్మన్ బాలాజీ కొన్ని తక్షణ చర్యలను ఆదేశించారు. వాటిలో ప్రధానంగా రాబోయే 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. రూమ్ ఆక్యుపెన్సీని మెరుగుపరచడానికి ప్రత్యేక వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించాలని సూచించారు. రీనోవేషన్ పనులను వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదనంగా, సిబ్బంది పనితీరును మెరుగుపరచవలసిన ఆవశ్యకతను చెప్పారు.
అనంతరం హోటల్ సేవల నాణ్యతను పెంపొందించి, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్శన ద్వారా హోటల్ నిర్వహణలో మెరుగుదలకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందించారు.