
*నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయమునకు చెల్లించవలసిన ట్రేడ్స్ లైసెన్సు బకాయిల వసూళ్లు వేగవంతం చేయమని సిబ్బందిని సంస్థ కార్యాలయమునకు చెల్లించవలసిన ట్రేడ్స్ లైసెన్సు బకాయిల వసూళ్లు వేగవంతం చేయమని సిబ్బందిని ఆదేశించిన కమిషనర్ వై ఓ నందన్*
నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ నందన్ వారాంతపు సమీక్ష సమావేశంలో భాగంగా పారిశుద్ధ్య సిబ్బందితో కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో భాగంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ నగరపాలక సంస్థ కార్యాలయమునకు చెల్లించవలసిన ట్రేడ్స్ లైసెన్సు బకాయిల వసూళ్లు వేగవంతం చేయమని సిబ్బందిని ఆదేశించారు. నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతి అంగడిని ట్రేడ్ లైసెన్స్ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు.
పారిశుద్ధ్య సిబ్బంది ప్రతిరోజు క్రమం తప్పకుండా హాజరయ్యేలా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. సచివాలయ పరిధిలోని ప్రతి రోడ్డు నందు వైర్లు, చెత్తగుట్టలు, సిల్ట్ తీసిన మట్టి, చెత్త కుప్పలు, ఎటువంటి ఉపయోగంలో లేని పరికరాలు లేకుండా రోడ్లు శుభ్రంగా ఉండునట్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పారిశుధ్య నిర్వహణ అనుగుణంగా నడుచుకోని వ్యాపారస్తులకు ఫైన్ విధించవలసినదిగా సిబ్బందిని ఉద్దేశించి ఆదేశించారు. డోర్ టు డోర్ చెత్త కలెక్షన్లను విధిగా నిర్వహించాలని ఈ సందర్భంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఉద్దేశించి ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రి, వెటర్నరీ డాక్టర్ మదన్మోహన్, టి.పి.ఆర్.ఓ వాసు బాబు, మలేరియా విభాగం డాక్టర్ జిజియా, సానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు