నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ పారిశుద్ధ్య పర్యవేక్షణలో భాగంగా గురువారం నెల్లూరు 53వ డివిజన్ పెట్రోల్ బంక్ డౌన్ గాంధీ గిరిజన కాలనీ, వారధి సెంటర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
స్థానిక 53వ డివిజన్లోని పెట్రోల్ బంకు డౌన్ వద్ద నివసిస్తున్న వారికి టిడ్కో గృహాలలో ఇళ్లను అందజేయాలని సూచించారు.
గతంలో ఇళ్లు మంజూరు అయ్యి నిర్మాణ పనులు పూర్తికాని గృహలను వెంటనే పూర్తి చేయించి స్థానికులను అక్కడికి తరలించాలని, వారందరికి అక్కడే పెన్షన్లు, రేషన్, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పధకాలను, ఉచిత సేవలను అందించేలా మ్యాపింగ్ చేయాలని సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు.
అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 140 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి 240 యూనిట్లు ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి అందిస్తున్న ఉచిత సోలార్ పథకాలు పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.
స్థానిక సచివాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పిల్లలు ఆడుకునేందుకు వీలుగా అవసరమైన ఆట వస్తువులను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
అన్ని డివిజన్ల లోని డ్రైను కాలువలలో ఆయిల్ బాల్స్ స్ప్రే, ఫాగింగు విధిగా నిర్వహించాలని శానిటేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గాంధీనగర్ గిరిజన కాలనీలో నివసిస్తున్న వారికి ఆధార్ నమోదు, చిన్నపిల్లలకు హెల్త్ చెకప్, వాక్సినేషన్, అంగన్వాడీల ద్వారా అందుతున్న పౌష్టికాహారం, చదువుల గురించి సంబంధిత మెప్మా వారికి తగు సూచనలు ఇచ్చారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి అయిన దగ్గర వెంటనే అన్ని గృహలను అనుసంధానం చేస్తూ కనెక్షన్లు ఇవ్వాలని పబ్లిక్ హెల్త్ డి.ఈ కి తగు సూచనలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేవరకొండ సుజాత, నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ. రామ్మోహనరావు, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, వెటర్నరీ డాక్టర్ మదన్మోహన్, డి.ఈ. రఘురాం, ఎలక్ట్రికల్ ఏఈ రమణారెడ్డి, రెవిన్యూ ఆఫీసర్ ఇనాయతుల్లా, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ప్రకాష్, ఎ.డి హార్టికల్చర్ ప్రదీప్ కుమార్, అధికారులు, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు
.