నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని మార్కెట్లు, గొర్రెల, పశువుల గంజిఖానా లకు సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరం గాను బహిరంగ వేలంను నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం నిర్వహించారు.
బహిరంగ వేలములో డైకస్ రోడ్డు గొర్రెల గంజి ఖానాను రూ.3,42,000/- లకు, డైకస్ రోడ్డు చేపల మార్కెట్ ను రూ.8,14,000/- లకు, డైకాస్ రోడ్డులోని చేపలు శుభ్రపరచగా వచ్చు వ్యర్థములను రూ.3,02,000/- లకు వేలము పాటదారులు 12 నెలల కాలపరిమితికి గాను స్వంతం చేసుకున్నారు.
బహిరంగ వేలములో డైకస్ రోడ్డు పశువుల గంజిఖానా, సంతపేట పశువుల గంజిఖానాలు వాయిదా వేయబడ్డాయి. శెట్టిగుంట రోడ్డు చేపల మార్కెట్టు, మైపాడు రోడ్డు చేపల మార్కెట్టు వేలములో పాటదారులు ఎవరూ పాల్గొనలేదు.
బహిరంగ వేలములో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ అధికారి ఇనాయతుల్లా, సూపరింటెండెంట్ శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.