*నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగపు కార్మికుల జీతాలు వెంటనే పెంచాలని మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టిన ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు.*

*****************************

*ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగం కార్మికులు నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు*

* *ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు ఇంజనీరింగ్ విభాగం అధ్యక్ష,కార్యదర్శులు ముని మోహన్ బాబు, మట్టిపాటి శ్రీనివాసులు మాట్లాడారు.*

*నెల్లూరు నగరపాలక సంస్థలో మంచినీటి సరఫరా,వీధిలైట్లు డ్రైనేజీ తదితర సౌకర్యాల కల్పనలో కీలక పాత్ర వహిస్తున్న ఇంజనీరింగ్ విభాగం కార్మికులు అత్యంత తక్కువ జీతాలు తీసుకుంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన వేతన సవరణ కమిషన్ కనీస వేతనం 26 వేల రూపాయలకు తక్కువ లేకుండా ఉండాలని నిర్ణయిస్తే నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగం కార్మికుల జీతం కేవలం 13 వేల రూపాయలు మాత్రమే ఉండడం బాధాకరమని అన్నారు. నైపుణ్యం గల పనులు చేస్తున్న ఇంజనీరింగ్ విభాగం కార్మికుల జీతాలు మిగతా వారి కన్నా ఎక్కువ ఉండాల్సింది పోయి అతి తక్కువ తీసుకుంటున్నారని అన్నారు. చాలీచాలని జీతాలు తీసుకుంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరి పట్ల ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం సరైన చర్య కాదని అన్నారు. దీనికి తోడు ప్రభుత్వం నుండి వర్తించే సంక్షేమ పథకాలన్నీ కూటమి ప్రభుత్వం నిలుపుదల చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. సచివాలయం పరిధిలోని ఆన్లైన్లో వీరందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేస్తున్నారని ఫలితంగా వీరికి ఏ సంక్షేమ పథకాలు వర్తించకుండా నిలుపుదల చేశారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇంజనీరింగ్ విభాగం కార్మికుల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటం ఉదృతం చేస్తామని నిరవధిక సమ్మెకు సైతం వెనకాడబోమని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు.*

*ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కే పెంచల నరసయ్య, సిఐటియు నెల్లూరు నగర నాయకులు పి సూర్యనారాయణ,ఇంజనీరింగ్ విభాగం యూనియన్ నాయకులు శివ, బాబ్జి,ప్రసాద్,శ్రీనివాసులు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.*

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed