నెల్లూరు నగరంలో లో *కూటమి ప్రభుత్వం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి* గారి దృష్టికి తీసుకువెళ్లిన… *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*
—————————————
*కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై చేస్తున్న అరాచకాలు అన్నింటిని..ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.*
అందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గం 15 వ డివిజన్ లో 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో శ్రమిస్తూ.. పార్టీ కార్యక్రమాల్లో ముందుంటున్న
*బాలకృష్ణారెడ్డి* గారి పై.. *తెలుగుదేశం పార్టీ కక్షగట్టి.. కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ ఆయన ఇంటిని నిర్దాక్షణ్యంగా కూల్చి వేసిన విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గారికి వివరించారు.*
*ఈ విషయం పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు నెల్లూరులో జరగడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.*
👉 *బాలకృష్ణ రెడ్డి గారికి అండగా నిలిచేందుకు ఇందుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ లీగల్ సెల్..సేవలను ను వినియోగించుకొని న్యాయపోరాటం సాగించాలని.. దీనిపై చట్టపరంగా ఏ విధంగా ఎదుర్కోవాలో.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని పార్టీ లీగల్ సెల్ ను జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు.*
👉 *తెలుగుదేశం పార్టీ నాయకులు.. ఇలాంటి ఘటనలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించారు. వేటిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని.. ఇలాంటి కార్యక్రమాలకు ఎవరైతే పాల్పడతారో వారందరికీ పేరుపేరునా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తగిన గుణపాఠం చెబుతుందన్నారు.*
👉 ఇలాంటి వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పక గుర్తు పెట్టుకుంటుందని.. *భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే.. రాష్ట్ర పార్టీ నుంచి కూడా పూర్తి మద్దతు తెలియజేయడంతో పాటు గా.. కార్యకర్తలకు అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలిపారు.*